D Prasad, News18, Kadapa
మనం సాధారణంగా సినిమాలలో చూసే కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు. నిజ జీవితంలో మనకి తారస పడుతుంటాయి. అటువంటి ఒక సంఘటన మన కడప జిల్లాలో చేటు చేసుకుంది. సినిమాలలో వజ్రాల దొంగతనాల సీన్లకీ... అభిమానులు అధికంగా ఉంటారు. అలాంటి ఒక వజ్రాల చోరి కడప (Kadapa) నగరంలో అదే సిని పక్కిలో జరిగింది. 2020 సంవత్సరంలో కడప నగరంలోని అల్మాస్ పేటకు చెందిన ఖాదర్ బాషా దగ్గర వజ్రాలు ఉండేవి. వాటిని అమ్మించి పెడతామని మాయమాటలు చెప్పి అతనిని ఒక లాడ్జిలో మాటామంతీ జరిపారు. ఆ తరువాత ఖాదర్ భాషని అదే లాడ్జిలో బంధించి తన దగ్గర వున్న విలువైన వజ్రాలకి చేజిక్కించుకుని పారిపోయారు. ఆ తర్వాత ఈ కేసుని నమోదు చేసుకునిదర్యాప్తు చేస్తున్న పోలీసులు... ఇటీవల ఆ వజ్రాల దొంగలని పట్టుకున్నారు.
నిందితులు గోవాకు చెందిన అంతర్ రాష్ట్ర దొంగలు ఇస్మాయిల్, షాహిద్ గా గుర్తించారు. వీరు దొంగలించిన వజ్రాలు విలువ అక్షరాల రూ.53 లక్షలు గా అంచనా వేశారు. వీరి వద్ద నుండి దొంగలించబడిన మూడు చిన్న వజ్రాలు మరియొక్కవిలువైన యెల్లో సఫైర్ వజ్రం పోలీసులు స్వాధీనము చేసుకున్నారు.నిందితుల ద్వారా అందిన సమాచారంతో పోలీసులు. తాజాగా మరొకరిని అరెస్టు అరెస్ట్ చేశారు.
అతని వద్ద నుండి దోచుకున్న రూ.60 లక్షల విలువైన వజ్రాలను స్వాధీనం చేసుకున్నారు.అదనపు ఎస్.పి (అడ్మిన్) తుషార్ డూడి ఆధ్వర్యంలో ఈ కేసు చేదించడంలో విజయం సాధించిన కడప డి.ఎస్.పి బి.వెంకట శివారెడ్డి, రిమ్స్ సి.ఐ కె. రామచంద్ర, ఎస్.ఐ ప్రతాప రెడ్డి మరియు సిబ్బందిని జిల్లా ఎస్పి అభినందించి వారికి రివార్డులు అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News