కడప నగరంలో గత 22 సంవత్సరాలుగా వైభవంగా విరాజిల్లుతున్న నగరంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో కోదండ రాముడి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత వుంది. ప్రతి సంవత్సరం వైభవంగా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకి భక్తులు నగర వాసులు విశేషంగా పాల్గొనిఆ సీతారామూలా ఆశీస్సులు అందుకుంటారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా శ్రీ కోదందరాముడికి నేటి నుండి వార్షికోత్సవాలు ప్రారంభం అయ్యాయి.
ఈ సంవత్సరం శ్రీ కోదండ రామాలయం 23వ వార్షికోత్సవాలు 4 రోజులపాటు ఫిబ్రవరి 8 - 9 - 10 - 11 వ తేదీలలో అత్యంత వైభవంగా విభిన్న రీతిలో భక్తి భావనలు పెంచేలా మరింత ఘనంగా నిర్వహించాలని దేవాలయ అధికారులు అభిప్రాయపడుతున్నారు. భక్తుల సహకారంతో మన ఆలయ ప్రతిష్ఠ మరింత పెరిగేలా ఈ ధార్మిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఈ కోదండ రామాలయం ప్రారంభించినప్పటి నుండి నిత్యం పూజలు, అర్చనలు, అభిషేకములు, పూజలతోపాటు ఎంతో మంచి అనేక హిందూ ధార్మిక సంస్థల కార్యక్రమములు, హోమములు, సంప్రదాయ నృత్యములు, భజనలు, అన్నమయ్య సంకీర్తనలకు ప్రత్యేక వేదికగా మారి, అన్ని పండుగలను సంప్రదాయ బద్ధంగా నిర్వహిస్తూ కోదండ రామాలయంభక్తుల మన్ననలు అందుకుంటూ వుంది.
శ్రీ కోదండ రామలయ కమిటి,సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించునటువంటి ఈ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సుప్రభాత సేవలు, అభిషేక అలంకార సేవలు, భక్తి గీతాలు, రామాయణ పారాయణం, వంటి అనేకమైన కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామని, భక్తాదులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని ఆశీస్సులు పొందవలసినదిగా ఆలయ కమిటీ వారు కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kadapa, Local News