D Prasad, News18, Kadapa
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వంలో వాలంటీర్లే కీలకం. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ చేరవేయడంతో వాలంటీర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. ఐతే నిత్యం వాలంటీర్ల పోస్టులు ఖాళీ అవుతూనే ఉండగా.. ఆయా జిల్లాల అధికారులు వాటిని భర్తీ చేస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కడప జిల్లా (YSR Kadapa District) లో వాలంటీర్ పోస్టుల (Volunteer Jobs) ఖాళీలు భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉపాధి కోసం ఎదురుచూసే వారికి ప్రభుత్వ ప్రకటన ఊరట కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు
గ్రామ,వార్డు సచివాలయాలల ఉత్తర్వుల మేరకు వైఎస్ఆర్ కడప జిల్లాలోని 35 మండలాలలో మరియు 07 మున్సిపాలిటీలలో ఏర్పడిన గ్రామ వార్డు వాలంటీర్ పోస్టులకి నియామకానికి అధికారులు ప్రకటన విడుదల చేశారు. వాలంటీర్ పోస్టులకు అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు http://graamavaalanteer.apgov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
నోటిఫికేషన్ విడుదల చేసిన తేది: 25/01/2023
ధరఖాస్తుల సమర్పించిన వలసిన తేదీలు: 26/01/2023 నుండి 27/01/2023 వరక
ఇంటర్వ్యూలు నిర్వహించు తేదీ: 29/01/2023
నియామకపత్రాలు అందించే తేదీ: 31/01/2023
ట్రైనింగ్, జాయినింగ్ తేదీ: 01/02/2023 నుండి
ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలను వెబ్ సైట్ ద్వారా నమోదు చేసకొని ఇంటర్వ్యూలకు హాజరుకావలసి ఉంటుంది. అర్హతలు, వయసు, ఇతర వివరాల్లో తేడాలుంటే వారిని తిరస్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఎంపికయిన వారంతా రూ.5వేల గౌరవ వేతనంతో వారికి కేటాయించిన 50 ఇళ్లకు సంబంధించిన విధులు నిర్వర్తించవలసి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Gram volunteer, Kadapa, Local News