హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఏపీలోకి యథేచ్ఛగా కర్ణాటక సరుకు.. ఆపే వాడే లేడా..?

ఏపీలోకి యథేచ్ఛగా కర్ణాటక సరుకు.. ఆపే వాడే లేడా..?

కడప జిల్లాలో కర్ణాటక మద్యం సీజ్

కడప జిల్లాలో కర్ణాటక మద్యం సీజ్

వేరు వేరు సంఘటనలలో అక్రమంగా మద్యం రవాణాచేస్తున్న వ్యక్తిని, టు టౌన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా యథేచ్చగా సాగుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah) | Andhra Pradesh

D Prasad, News18, Kadapa

వేరు వేరు సంఘటనలలో అక్రమంగా మద్యం రవాణాచేస్తున్న వ్యక్తిని, టు టౌన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో మద్యం అక్రమ రవాణా యథేచ్చగా సాగుతుంది. రాష్ట్రంలో అధికంగా వున్న మద్యం ధరలతో అక్రమ రవాణాదారులు పలురకాలుగా మద్యాన్ని తరలిస్తున్నారు. ఇటీవల కర్ణాటక (Karnataka) నుండి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తినీ పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన మద్యం సుమారు 1.6 లక్షల విలువైనదిగా పోలీసులు అంచనా వేశారు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా (Kadapa District) మైదుకూరు జాతీయ రహదారి రావుల పల్లి క్రాస్ వద్ద ఎన్ఫోర్స్ మెంట్, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా వాహనాల తనిఖీలు చేయగా, పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడింది.

ఈ మద్యాన్ని కారులో కర్ణాటక నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తి బ్రహ్మంగారి మఠంకు చెందిన ఇండ్ల నిత్య శివరాం(36) గా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుంచి 1.6 లక్షల విలువ కలిగిన వివిధ రకాల కర్ణాటక మద్యం బాటిళ్లు, 8 లక్షల విలువైన మహీంద్రా టి.యూ.వి కారును పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. ఈ విషయం గురించి అదనపు ఎస్పీ తుషార్ డూడి నగరంలోని కో ఆపరేటివ్ కాలనీ స్పెషల్ ఎన్ఫోర్స్ మెంట్ బ్యూరో స్టేషన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాకి సమాచారం వెల్లడించారు.

ఇది చదవండి: భర్త దూరమయ్యాడని.. మరొకరికి దగ్గరైంది. కానీ ఆ బంధమే..

పెద్ద ఎత్తున అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్న ఎస్.ఈ.బి అధికారులు, సిబ్బందిని అభినందించారు. అదే విధంగాకడప టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న అక్బర్ అలీ అనే దొంగని పోలీసులు అరెస్టు చేశారు. అతని దగ్గర నుండి సుమారు 4 లక్షల విలువగల బంగారు వెండి స్వాధీనం చేసుకున్నారు. ఇది వరకే పలు పోలీస్ స్టేషన్ లలో గతంలో ఐదు కేసుల్లో నిందితుడిగా వున్నాడని పోలీసులు వెల్లడించారు.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News

ఉత్తమ కథలు