జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం ఊపందుకుంటోంది. పలు రకాల పార్టీలు ఇప్పటికే విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు. ఈ ఎన్నికలకి సంబంధించి అతి తక్కువ సమయం మాత్రమే వుంది. అందువలన ఓటర్ల కి జిల్లా కలెక్టర్ గుర్తిపు కార్డుల గురించి మార్గదర్శకాలు విడుదల చేశారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలో.. ఓటరు గుర్తింపు కార్డు లేనివారు భారత ఎన్నికల సంఘం ఆమోదించిన 11 రకాల ఫోటో గుర్తింపు కార్డులలో ఏదో ఒకదానిని చూపి తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి వి.విజయరామరాజు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
పోలింగ్ సమయంలో ఓటర్లు తమ గుర్తింపును రుజువు చేసుకునేందుకు వీలుగా ఓటరు ఫోటో గుర్తింపు కార్డును ఉపయోగించడం జరుగుతోందన్నారు. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉన్నప్పటికీ వారి గుర్తింపును రుజువు చేసుకునేందుకు.. భారత ఎన్నికల సంఘం ఫోటో ఓటరు గుర్తింపు కార్డును జారీ చేయడం జరిగిందన్నారు.
ఈ నెల 13న నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలో ప్రతి ఓటరూ.. పోలింగ్ కేంద్రానికి తమ వెంట ఖచ్చితంగా ఫోటో ఓటరు గుర్తింపు కార్డును తీసుకెళ్లి ఓటు వేయాలన్నారు. ఫోటో ఓటరు గుర్తింపు కార్డు లేని ఓటర్లు.. అందుకు ప్రత్యామ్నాయంగా దిగువ పేర్కొన్న పత్రాలలో ఏదో ఒకదానిని చూపి ఓటు హక్కును వినియోగించుకోవచ్చునని కలెక్టర్ పేర్కొన్నారు.
11 రకాల ఫోటో ధృవీకరణ పత్రాలు ఏమిటంటే.
1. భారతీయ పాస్ పోర్ట్,
2. డ్రైవింగు లైసెన్సు,
3. కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు, పి.ఎస్.యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫోటో గల సర్వీసు గుర్తింపు కార్డులు,
4. బ్యాంకులు / పోస్టాఫీసులు జారీ చేసిన ఫోటో గల పాస్ పుస్తకాలు,
5. పాన్ కార్డు,
6. ఎన్.పి.ఆర్ క్రింద ఆర్జీఐ చే జారీ చేసిన స్మార్ట్ కార్డు,
7. ఎంఎన్ఆర్ఇజిఏ (ఉపాధి హామీ) జాబ్ కార్డు,
8. కార్మిక మంత్రిత్వ శాఖ పథకం క్రింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు,
9. ఫోటో గల పింఛను పత్రం,
10.ఎంపీలు, ఎంఎల్ఎలు, ఎంఎల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు.
11. ఆధార్ కార్డు,
పైన తెలిపిన వాటిలో ఒక గుర్తింపు కార్డును చూపించి ఓటువేయడానికి రావాలని కలెక్టర్ సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News