D.Prasad, News18, Kadapa
కడప జిల్లా ఎంతో మహిమ కలిగిన శివాలయాలకు ప్రసిద్ధి, ఇక్కడి శివ క్షేత్రాలు అబ్బురపరచే పురాతన చరిత్ర కలిగి వుంటాయి.కడప నగరానికి సుమారు 06 కిలోమీటర్ల దూరంలో అటువంటి పురాతన చరిత్ర కలిగిన పుణ్య క్షేత్రం కలదు. ఇక్కడి ఆలయం చుట్టూ పచ్చని పంటపొలాలు, తోటలలో అందమైన పరిసరాలతో, బుగ్గ వంక నది ప్రవాహం కలిగిన బుగ్గ శివాలయ చరిత్ర మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
సుమారు 2000 వేల సంవత్సరాల చరిత్ర ఈ బుగ్గ శివాలయానికి కలదని స్థానికులు చెపుతున్నారు. ఈ శివాలయంలోని లింగం పూర్వం సాక్షాత్తు బృగు మహర్షి చేత ప్రతిష్టించబడింది.ఎన్నో సంవత్సరాల క్రితం బుగ్గవంక పరిసర ప్రాంతాలు నిరంతరం వరదల కారణంగా ముంపుకి గురయ్యేవని, ఇక్కడి ప్రజలు తీవ్ర నిరాశతో అక్కడే తపస్సు చేసుకునే బృగు మహర్షిని పార్ధించగా ఆయన శివలింగాన్ని ప్రతిష్టించిఅక్కడి బుగ్గవంక ప్రవాహాన్ని మళ్లించారు. అందువలనే గుడి పక్కనే ప్రవహించే నదికి బృగు నది పేరు వచ్చిందని అది కాల క్రమమేనా బుగ్గ వంకగా రూపాంతరం చెందిందని చరిత్ర చెపుతుంది.
అక్కడి ప్రజల కష్టాలు తోలిగాయని ఆ తరువాత, ప్రస్తుతం వున్న శివాలయాన్ని నిర్మించారని ఆ తరువాత ప్రతి సంవత్సరం వైభవంగా పూజలు జరిగేవని చరిత్రకారులు చెపుతున్నారు.ఈ ఆలయ నిర్మాణం చూసినట్లయితే తూర్పు ముఖంగా నిర్మించిన ఈ ఆలయంలో ఎదురుగా శివలింగం దర్శనమిస్తుంది. ఆ పక్కనే అమ్మ వారు, ఆననేయ స్వామి విగ్రహాలు వున్నాయి. లోపలి ప్రాకారాలు అక్కడి గుడి నిర్మాణ శైలి పురాతమైన కాలానికి చెందినదిగా మనకు అర్థమవుతుంది.ఇప్పటికీ ఈ ప్రాంతానికి హిమాలయాల నుండి సాధువులు వచ్చి దర్శనం చేసుకుని వెళ్తుంటారని ఇక్కడి స్థానికులు చెపుతున్నారు.
ఎంతో వైభవంగా విరాజిల్లిన ఇంతటి పురాతన చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని, ఆలయ చరిత్రని కాపాడాలని. ఇక్కడి స్థానికులు మరియు సందర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News