D.Prasad, News18, Kadapa
ఒంటిమిట్ట ఈ పేరు వినగానే ఇక్కడ కొలువై వున్నా కోదండ రాముడు మన మదిలో మెదలుతారు. ఆ తర్వాత ఈ ప్రాంతంలో అంతటి ఆకర్షణీయమైన అంశం ఏదైనా వుందంటే అది ఆలయ నిర్మాణ కాలం నాటి నుండి మనకు దర్శనమిస్తున్న అతి పెద్ద ఒంటిమిట్ట చెరువు. మన కడప జిల్లాలలోని అతి పెద్ద చెరువులలో ఒంటి మిట్ట చెరువుకు అధిక ప్రాధాన్యత కలిగి వుంది. ఈ చెరువు చూసినంతమేర విస్తరించి, అటువైపు ఉన్న కొండలని ఆనుకుని చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఈ ప్రాంతానికి వచ్చిన వారు ఈ చెరువును చూసే ఉంటారు. ఆకర్షణీయంగా కడప-తిరుపతి రహదారి పక్కనే వున్నా ఈ ఒంటిమిట్ట చెరువుకి ఎంతో గొప్ప చరిత్ర దాగివుంది.ఒకప్పుడు అనగా 1340వ సంవత్సరంలో ఈ ఒంటిమిట్ట ప్రాంతం దట్టమైన చెట్ల తో నిండి అరణ్యంగా ఉండేది.
ఇప్పటి కొదందరామాలయాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించిన ఒంటడు–మిట్టడు ఈ ప్రాంతంలో బోయ నాయకులుగా నివసించేవారు. ఆ సమయంలో ఒంటిమిట్ట ప్రాంతానికి వచ్చిన అప్పటి ఉదయగిరి పరిపాలకులైన చక్రవర్తి కంపరాయులు అక్కడికి రాగా, ఆయనకీ వారు రామ తీర్థంలోని నీటిని అందించి దాహం తీర్చి వారికి సకల మర్యాదలు చేశారు.
ఆ సమయంలో రాజు దగ్గరికి వెళ్లి అప్పటికి శిథిలం అవుతున్న రాములవారీ గుడిని చూపింది. అభివృద్ధి చేయాలని వారు రాజును కోరడం జరిగినది. ఆ తర్వాత కంపరాయలు వారి విన్నపాన్ని అంగీకరించి గుడి నిర్మాణంతోపాటు సమీపంలోని చెరువుని ఊరి ప్రజలకి ఆసరాగా ఉంటుందని భావించి సమీపంలో చెరువు నిర్మాణం తలపెట్టారు. ఈ నిర్మాణ బాధ్యతలని ఒంటడు, మిట్టడులకు అప్పగించారు.ఈ విధంగా అప్పటినుంచి ఈ చెరువు ద్వారా సమీప గ్రామాల వారు చెరువు సహకారంతో పొలాల ద్వారా వచ్చే ఫలసాయాన్ని అనుభవిస్తూ ఆలయంలోని రాముల వారికి పూజలు చేసేవారని చరిత్ర చెపుతుంది
.ఆ చెరువే నేడు కడప జిల్లాలో అతి పెద్ద చెరువుగా వుంటూ ఎన్నో వేల ఎకారాల సాగుభూమికి నీటిని అందిస్తూ వుంది. అలాగే వేసవి సమయాలలో ఈ చెరువు ఎండిపోయే ప్రమాదాన్ని నివారించడానికి చెరువులోనికి సోమశిలా వెనుక జాలాలను ప్రత్యేక పైప్ లైన్ల ద్వారా ఇక్కడిని నీటిని రప్పించే ఏర్పాట్లని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News