వైయస్ఆర్ కడప జిల్లాలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి తోడు భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులుతో పలు చోట్ల పిడుగులు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షానికి వేంపల్లి,కొండాపురం,చెన్నూరు,గోపవరం, చిన్నమాచుపల్లి తదితర ప్రాంతాల్లోరైతులకు భారీ నష్టం వాటిల్లింది. మామిడి, అరటి, తమలపాకు తోటలు, నుగు, ప్రొద్దుతిరుగుడు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు విరిగి పడిపోయాయి.. రోడ్ల వెంబడి చెట్లు, ఇంటి పైకప్పులు ధ్వంసమయ్యాయి. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అంతే కాకుండా.. రోడ్లపై చెట్టుకొమ్మలు విరిగిపడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.
అకాల వర్షంతో రైతులు తీవ్రమైన పంటనష్టాన్ని ఎదుర్కొంటున్నారు. చేతికి వస్తుందనుకున్న పంట.. ఇలా కళ్లముందే నీటిపాలు కావడం చూసి రైతన్నలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అనేక చోట్ల ఇప్పటికి కరెంట్ సరఫరా లేకపోవడంతో బాధితులు విద్యుత్ అధికారులను సంప్రదించారు. కొన్ని చోట్ల అధికారులు పలు సమస్యల కారణంగా మరమ్మత్తు పనులు చేస్తున్నారు.
విద్యుత్ అధికారులు. అధికారులు స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని ఆస్తి నష్టం అంచన వేసి నష్ట పరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు. పలు చోట్ల కురిసిన వడగండ్ల వానకు వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. మరికొన్ని రోజుల పాటు ఇలాగే వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షంలో బైటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొవాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Heavy Rains, Kadapa, Local News