హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kadapa: శ్రీ లలితా పంచాయతన ఆలయంలో ఘనంగా అక్షరాభ్యాస నిర్వాహణ 

Kadapa: శ్రీ లలితా పంచాయతన ఆలయంలో ఘనంగా అక్షరాభ్యాస నిర్వాహణ 

X
ఉల్లాసంగా

ఉల్లాసంగా పాల్గొన్న భక్తులు

Andhra Pradesh: ఈ రోజు మాఘ సుద్ధ పంచమి, అనగా మాఘ మాసంలో శుక్ల పక్షం లో వచ్చే రోజుని మాఘ శుద్ధ పంచమి లేదా వసంత పంచమి అని కూడా పిలుస్తారు. ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత వుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

D.Prasad, News18, Kadapa

ఈ రోజు మాఘ సుద్ధ పంచమి, అనగా మాఘ మాసంలో శుక్ల పక్షం లో వచ్చే రోజుని మాఘ శుద్ధ పంచమి లేదా వసంత పంచమి అని కూడా పిలుస్తారు. ఈ రోజుకి ఎంతో ప్రత్యేకత వుంది. ఏమిటా ప్రత్యేకత అనుకుంటున్నారా..? ఈ రోజు సాక్షాతూ సరస్వతి అమ్మ వారు ఆవిర్భవించిన రోజు. హిందువులకి ఈ రోజు ఎంతో పవిత్రమైనది. ఈ రోజున సరస్వతి అనుగ్రహం పిల్లల మీద వుండాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఈ రోజున సరస్వతి దేవి సమక్షంలో అక్షరాభ్యాసం నిర్వహించడం మన సనాతన ధర్మంలో ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం.

మన కడప నగరంలో ఈ మాఘశుద్ధ పంచమిని పురస్కరించుకుని కడప నగరంలోని ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటైన చిన్మయా మిషన్, శ్రీ లలితా పంచాయతన ఆలయంలో పిల్లలకి అక్షరాభ్యాసాలని నిర్వహించారు. జగన్మాత స్వరూపిణి అయిన లలితా దేవి ఈ రోజు సరస్వతి దేవి స్వరూపంలో ప్రత్యేకపూజలు అందుకుని భక్తులకి దర్శనం ఇచ్చారు. ఈ అక్షరాబ్యాస కార్యక్రమంలో తల్లిదండ్రులు వారి 2 ,3 సంవత్సరాల పిల్లలకి అక్షరాభ్యాసాలని చేయించారు.

ఇదే రోజున సరస్వతి అమ్మ వారు ఆవిర్భవించడం వలన, ఈ రోజు వారి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించడం ద్వారా వారు భవిష్యత్తులో విద్యా బుద్దులు నేర్చుకుని, సత్ప్రవర్తనతో ఉన్నత స్థానాలని అధిష్టిస్తారని తల్లిదండ్రులు భావిస్తారు. ఈ కార్యక్రమంలో పెద్దమొత్తంలో తల్లిదండ్రులు వారి పిల్లలకి అక్షరాభ్యాసం చేయించారు. ఈ అక్షరాభ్యాసం కార్యక్రమంలో మొదట గణపతి పూజతో ప్రారంభించి తరువాత సరస్వతి దేవికి భక్తిశ్రద్ధలతో తల్లిదండ్రులు పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత శ్రీ తురియానంద సరస్వతి గారు పిల్లలకి బలపం అందించి పలకపై, మరియు పసుపు కొమ్ముతో బియ్యంలో అక్షరాలను దిద్దించారు.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News

ఉత్తమ కథలు