కడప నగరంలో అత్యంత విశిష్టత కలిగిన విజయ దుర్గా దేవి దేవాలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విశేషమైన ప్రజాదరణ కలిగి మహోన్నతమైన మహిమ కలిగిన శ్రీ విజయ దుర్గా దేవి అమ్మవారికి ఘనంగా 21 వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి.అమ్మవారి 21వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణం మొత్తం అందమైన అలంకరణలతో, కళ్ళు మిరుమిట్లుగొలిపే అద్భుతమైన దీపకాంతులతో వెలిగిపోతూ భక్తులకి ఆనందం కలిగిస్తుంది.
మంగళవారంరోజు అంగరంగ వైభవంగా వేడుకలు జరిగాయి. పొద్దున్నే ఆలయ ధర్మకర్త ఆధ్వర్యంలో అమ్మవారికి వేదం పండితుల సమక్షంలో పూజలు నిర్వహించారు, ఆపై విజయ దుర్గా దేవి, మల్లికార్జున స్వామి కల్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించారు.రాత్రికి జరిగిన అమ్మవారి గ్రామోత్సవం, ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అత్యంత వైభవంగా సాగిన అమ్మవారి గ్రామోత్సవంలో, ఆలయ పూజారులు అందమైన పువ్వులతో అమ్మవారిని అలంకరించారు.
ఆలయం వద్ద నుండి ప్రధాన రహదారిలో సాగిన గ్రామోత్సవానికి భక్తులు విశేషంగా హాజరై అమ్మవారిని తిలకించారు. ఈ గ్రామోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా కేరళ సింగారి మేళం, తెనాలి బ్యాండ్ ఆర్కెస్ట్రా, కరీంనగర్ తాషా డ్రమ్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సత్తెన పల్లె ఫైర్ వర్క్స్ బాణసంచా ఏర్పాట్లు భక్తులని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ అద్భుతమైన గ్రామోత్సవాన్నిచూడడానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు.ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతలని ఏర్పాటు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Kadapa, Local News