హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పోలీసుల ఉక్కుపాదం.. 19 మంది అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్..

పోలీసుల ఉక్కుపాదం.. 19 మంది అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లర్స్ అరెస్ట్..

స్మగ్లర్ లను పట్టుకున్న పోలీసులు

స్మగ్లర్ లను పట్టుకున్న పోలీసులు

Andhra Pradesh: గత కొంత కాలంగా జిల్లాలో పెరిగిపోతున్న గంజాయి వినియోగాన్ని రూపుమాపేందుకు గంజాయి స్మగ్లర్ల పై జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

గత కొంతకాలంగా జిల్లాలో పెరిగిపోతున్న గంజాయి వినియోగాన్ని రూపుమాపేందుకు, గంజాయి స్మగ్లర్ల పై జిల్లా పోలీసులు ఉక్కు పాదం మోపారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు చేస్తున్న 19 మంది అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసి మీడియా ముందుకు ప్రవేశ పెట్టారు.

ఆ వివరాలు... చూద్దాం.. జిల్లాలోకి గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని స్మగ్లింగ్ చేసే 19 మంది అంతర్ రాష్ట్ర ముఠా సభ్యులు కటకటాల పాలయ్యారు. 40 మంది స్పెషల్ టీమ్, ఎస్.ఈ.బి సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో కమలాపురం పోలీస్ స్టేషన్పరిధిలో ఐదుగురు, కడప వన్ టౌన్ లో ఐదుగురు, పోరుమామిళ్ల లో 8 మంది, సిద్దవటంలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్దనుండి 28 కేజీల గంజాయి, ఒక ఫోర్డ్ కారు, 4 బైక్ లు స్వాధీనం చేసుకున్నామని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ వెల్లడించారు.

గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న వారే కాకుండా, చిన్న చిన్న పొట్లాల్లో విక్రయిస్తున్న పలువురిని కూడా అదుపులొకి తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అంతే కాకుండా అరెస్ట్ అయిన వారినుండి మరికొందరు వ్యక్తులపై నిఘా పెట్టామని, ఈ గంజాయి అక్రమ రవాణా వైజాగ్ నుంచి ట్రైన్, కార్లలో రవాణా చేస్తున్నట్లు విచారణలో గుర్తించామని తెలిపారు.ఇది వరకు గంజాయి వినియోగిస్తున్న 30 మందికి రిహాబిలిటేషన్ సెంటర్ లో కౌన్సిలింగ్ చేశామని తెలియజేశారు.

అలాగే ప్రజలు గంజాయి విక్రయాలు, వినియోగించే వారి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 100 లేదా తన ఫోన్ నెంబర్ 9440796900 కు ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు.ఈ గంజాయిని పట్టుకోవడంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ పూజిత నీలం ఆధ్వర్యంలో గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుండి గంజాయి, కారు, మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఫ్యాక్షన్ జోన్ డి.ఎస్పీ చెంచుబాబు, కడప డిఎస్పీ బి. వెంకట శివారెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, ఎస్.బి ఇన్స్పెక్టర్ రాజా ప్రభాకర్, కడప వన్ టౌన్ సి.ఐ నాగరాజు, కమలాపురం సి.ఐ సత్యబాబు, మైదుకూరు సి.ఐ చలపతి, ఎస్.ఈ.బి ఇన్స్పెక్టర్ ఉరుకుందమ్మ, ఎస్.ఐ లు పెద్ద ఓబన్న, మధుసూదన్ రెడ్డి, గణ మద్దిలేటి, ఆర్.ఎస్.ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది ని జిల్లా ఎస్.పి గారు ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డులు అందచేశారు.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Kadapa, Local News

ఉత్తమ కథలు