D Prasad, News18, Kadapa
మీకు బొరుగులు తెలుసా ...! రాయలసీమ (Rayalaseema) ప్రాంతం వారికి ఈ బొరుగులు బాగా సుపరిచితం. కొన్ని ప్రాంతాల్లో వీటిని మరమరాలు అని అంటారు. వీటిని అనేక విధాలుగా వాడుతుంటారు. వీటితో తయారు చేసే ఉగ్గాణి రాయలసీమ వాసులకు ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్. ఈ ఉగ్గానిని ఆయా ప్రాంతాలను బట్టి పప్పుల పొడి, బజ్జితో పాటు వడ్డిస్తూ ఉంటారు. మరి ఈ ఉగ్గాణి తయారు చేయడంలో వాడే బొరుగుల గురించి వాటి తయారి విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కడప (Kadapa) శివార్లలో ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ కి వెళ్ళేదారిలో ఇండ్రస్ట్రీయల్ ఎస్జేట్ లో నంది బొరుగుల ఫ్యాక్టరి ఉంది. ఈ ఫ్యాక్టరీని 2004లో ఓబుల్ రెడ్డి స్థాపించారు. గత 20ఏళ్లుగా ఓబుల్ రెడ్డి కుటుంబం ఇదే పరిశ్రమను నడుపుతోంది. కడప నగరంలో వీళ్లు తయారు చేసిన బొరుగులే కనిపిస్తాయి.
ఇక ఈ బొరుగుల తయారి విషయానికి వస్తే.. మొదటగా రైతుల నుంచి ఈ బొరుగులకి కావలసిన వడ్లు సేకరిస్తారు. ఆ తరువాత అవి వివిధ దశలలో తయారవుతాయి. మొదటగా రైతులనుండి తీసుకున్న వడ్లని శుభ్రపరుస్తారు, శుభ్రమైన వడ్లను నానబెట్టిన తరువాత బాయిలర్లో ఉడకబెడతారు. అనంతరం వాటిని ఆరబోసి, మిషన్ పడతారు. అనంతరం ఓ పెద్ద మిషన్ లో వేస్తే కొంత సేపు ఆ మిషన్ వివిధ రకాలుగా ప్రాసెస్ అయి చివరికి బొరుగులు తయారు అవుతాయి.
ఇలా తయారైన బొరుగులని, బరువుల వారీగా కొలిచి వ్యాపారులకు, ప్రజలకి అనువుగా ఉండేలా చిన్న పెద్ద సంచులలో ప్యాకింగ్ చేసి సరఫరా చేస్తారు. . ఈ బొరుగుల తయారీ పరిశ్రమ దాదాపు 20 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఒకప్పుడు ఈ పరిశ్రమలో బాగానే లాభాలు ఉండేవని కాని నేడు పెరిగిన విద్యుత్ రేట్లు, ప్రధాన ముడి సరుకు అయిన వడ్లు పండించే రైతులు తగ్గిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని నిర్వాహకులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News