హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మట్టికుండలో నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

మట్టికుండలో నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

X
మట్టికుండలో

మట్టికుండలో నీటితో లాభాలెన్నో

వేసవి (Summer) వచ్చిందంటే అందరు చల్లదనాన్ని కోరుకుంటారు. చల్లటి పండ్ల రసాలు, చల్లటి వాతావరణం కోసం పరితపిస్తుంటారు. ఇక మంచినీటి కోసం ఫ్రిజ్ లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఫ్రిజ్ లో కృత్రిమంగా చల్లబరిచిన ఆ నీటిని తాగుతూ అనేకమైన అనారోగ్యాలకి గురవుతున్నారని నివేదికలు చెపుతున్నాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India

D Prasad, News18, Kadapa

వేసవి (Summer) వచ్చిందంటే అందరు చల్లదనాన్ని కోరుకుంటారు. చల్లటి పండ్ల రసాలు, చల్లటి వాతావరణం కోసం పరితపిస్తుంటారు. ఇక మంచినీటి కోసం ఫ్రిజ్ లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఫ్రిజ్ లో కృత్రిమంగా చల్లబరిచిన ఆ నీటిని తాగుతూ అనేకమైన అనారోగ్యాలకి గురవుతున్నారని నివేదికలు చెపుతున్నాయి. మన పూర్వం రోజుల్లో వేసవి వచ్చిందంటే చాలు ఇంట్లో పేదవాళ్లు కుమ్మరి ఇంటికి వెళ్లి కొత్త కుండ తీసుకొచ్చి వాటిలో నీటిని నింపే వారు ఆ నీరు కొద్దిసేపటి తర్వాత చల్లగా మారి వేసవి తాపాన్ని తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇప్పటికి కొద్ది ప్రాంతాలలో ఈ మట్టి కుండలని మాత్రమే వినియోగిస్తున్నారు. ఇలాంటి కుమ్మరి వృత్తినే ప్రధానంగా నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలు ఇంకను ఉన్నాయి. అలాంటి కుమ్మరి చేతిలో అందంగా తీర్చిదిద్దే కుండల్లోని నీళ్లు తాగటంతో వచ్చే ఉపయోగాలు తెలుసుకుందాం.

కడప (Kadapa) నగరంలోని నెహ్రూ నగర్ సమీపంలో ఉన్న ఓ పెద్దావిడ.. గత 40 ఏళ్లుగాకుండలు అమ్ముతూ వచ్చిన ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంది. అసలు ఈ కుండలతో చాలా ఉపయోగాలున్నాయి. మన పురాతన సంస్కృతి ప్రకారం మట్టి కుండలోని నీటి ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అందువలన ఆకాలంలో అందరూ మట్టికుండలో మాత్రమే నీటికి తాగేవారు తాము కూడా ఇప్పటికి కుండల్లోనే వంట చేసుకుని తింటున్నామని చెబుతున్నారు.

ఇది చదవండి: ఆ జిల్లాను వదలని పెద్దపులి.. బిక్కుబిక్కుమంటున్న జనం

ఇప్పటికి పెద్దవారు మట్టికుండలో నీటికి అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ మట్టి కుండలు సహజంగా భాష్పీభవనం సూత్రంపై పని చేసి ఎల్లప్పుడూ నీళ్లను చల్లగా ఉంచుతాయంటున్నారు. అంతే కాకుండా మట్టి కుండలు సహజ సిద్ధంగానే నీటిని వడకట్టి నీటిలో ఉండే మలినాలను, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వాటిని నిర్మూలించి శుద్ధమైన మంచి నీటిని మనకు అందిస్తుందని చెబుతున్నారు.

మట్టిలో ఉండే ఆల్కలిన్ స్వభావం నీటిలో ఉండే ఆమ్లతత్వాన్ని నిర్మూలించి మన శరీరంలో ఉదర సంబంధిత వ్యాధులను తగ్గించి అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలను నిర్మూలిస్తుంది మరియు జీవక్రియ రేటును పెంచుతుంది.వేసవికాలంలో మట్టికుండలోని నీరు తాగడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అంతేకాకుండా మట్టికుండలో నిల్వ చేయబడిన నీళ్లు చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. జలుబు, ఆస్తమా, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వంటి వ్యాధులతో బాధపడే వారికి ఈ కుండ నీరు ఎంతో మంచిది. తరచుగా చిన్న పిల్లలలో ఈ ఫ్రిజ్ లోని నీరు తాగడం మూలంగా తలెత్తే అనారోగ్య సమస్యలని నివారించడానికి కుండ నీరు ఎంతో ముఖ్యం.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News

ఉత్తమ కథలు