ఒకే రోజు 15 కరోనా కేసులు... బఫర్ జోన్‌లోకి కడప

గత పది రోజుల్లో జిల్లాలో ఒకటి కూడా కరోనా పాజిటివ్‌ నమోదు కాకపోయినా బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో అన్ని జిల్లా కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి.

news18-telugu
Updated: April 2, 2020, 11:00 AM IST
ఒకే రోజు 15 కరోనా కేసులు... బఫర్ జోన్‌లోకి కడప
కడప నగరంలో ఈనెల 27 నుంచి ‘లాక్ డౌన్’ విధించనున్నట్టు పోలీసులు ప్రకటించారు.
  • Share this:
బుధవారం ఒక్కరోజే కడప జిల్లాలో 15 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కడప నగరానికి చెందిన నలుగురు, ప్రొద్దుటూరు పట్టణంలో ఏడుగురు, వేంపల్లిలో ఇద్దరు, బద్వేలు, పులివెందుల ప్రాంతాలకు చెందిన ఒక్కొక్కరికి కరోనా వైరస్ సోకింది. ఢిల్లీలోని నిజాముద్ధీన్‌ ప్రార్థనలకు జిల్లా నుంచి 86 మంది వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. గత పది రోజుల్లో జిల్లాలో ఒకటి కూడా కరోనా పాజిటివ్‌ నమోదు కాకపోయినా బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో అన్ని జిల్లా కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. వ్యాధి సోకిన వారందరికి కడప శివారులోని ఫాతిమా మెడికల్‌ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన కొందరికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని కలిసిన వ్యక్తులపై అధికారులు దృష్టి సారించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారితో ప్రైమరీ కంట్రాక్టు వ్యక్తులను కూడా ఫాతిమా మెడికల్‌ కళాశాలలో చికిత్స అందిస్తున్నారు. కరోనా బారిన వ్యక్తులున్న ప్రాంతాలను కంటోన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. పాజిటివ్‌ ఉన్న వ్యక్తి ప్రాంతం కేంద్రంగా మూడు నుంచి ఎనిమిది కిలోమీటర్ల రేడియేషన్‌లో రాకపోకలు నిషేధించారు. మూడుకిలోమీటర్ల పరిధిలో ఉన్నవారికి నిత్యావసరాలను డోర్‌డెలివరీ ద్వారా అందించేందుకు నిర్ణయించారు.

పులివెందుల రోడ్డులోని ఫాతిమా మెడికల్‌ కళాశాలలో కోవిడ్‌ ఆస్పత్రిని కలెక్టర్‌ సందర్శించి వసతులపై ఆరా తీశారు. కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు గుర్తించిన క్రమంలో కడప నగరమంతా బఫర్‌జోన్‌ పరిధిలోకి వస్తుందని అధికారులు తెలిపారు. కడపలోని నగరంలోని సాయిపేట, అబ్దుల్‌ నబీ స్ట్రీట్, అలంఖాన్‌ పల్లెలకు సంబంధించి నుంచి మూడు కిలోమీటర్ల పరిధిలో కోర్‌జోన్‌గానూ, కోర్‌జోన్‌ల నుంచి ఐదు కిలోమీటర్ల మేరకు బఫర్‌జోన్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు ఎట్టిపరిస్థితుల్లోనూ వీధుల్లో తిరగరాదని స్పష్టం చేశారు.
Published by: Kishore Akkaladevi
First published: April 2, 2020, 10:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading