హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఎస్సీ, ఎస్టీలపై వివక్షతలను రూపుమాపేందుకు కృషి చేయండి

ఎస్సీ, ఎస్టీలపై వివక్షతలను రూపుమాపేందుకు కృషి చేయండి

సాంఘిక సాంక్షేమ శాఖపై కడప జిల్లా కలెక్టర్ సమీక్ష

సాంఘిక సాంక్షేమ శాఖపై కడప జిల్లా కలెక్టర్ సమీక్ష

దేశానికి స్వాతంత్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి కొన్ని ప్రాంతాలలో తక్కువ కులం అంటూ విచక్షణా రహితంగా వివక్ష చూపించడం మనం నేటికి చూస్తున్నాము. ఎస్సీ,ఎస్టీలపై వివక్షతను రూపుమాపేందుకు కృషి చేయాలని కడప జిల్లా (Kadapa District) కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India

D Prasad, News18, Kadapa

దేశానికి స్వాతంత్యం వచ్చి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్నా కూడా నేటికి కొన్ని ప్రాంతాలలో తక్కువ కులం అంటూ విచక్షణా రహితంగా వివక్ష చూపించడం మనం నేటికి చూస్తున్నాము. ఎస్సీ,ఎస్టీలపై వివక్షతను రూపుమాపేందుకు కృషి చేయాలని కడప జిల్లా (Kadapa District) కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు. నిర్మూలించాలని, మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని స్పందన హాల్ నందు జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అధ్యక్షతన సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.., ప్రతి నెల జరిగే మొదటి స్పందన కార్యక్రమంలో మొదటి గంటలో ఎస్సీ ,ఎస్టీలకు ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తామన్నారు.

ప్రభుత్వ బాలికల వసతి గృహాలు,ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో క్రమం తప్పకుండా బీట్ చేపట్టాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎస్సీ ,ఎస్టీలపై అత్యాచారాలు జరిగినప్పుడు వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని. అలాంటి కేసులలో బాధితులకు పరిహారం అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే వారికి సంబంధించిన భూ సమస్యలు ఏమైనా ఉంటే వాటిపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పరిష్కరించాలని, నిమ్న వర్గాల ప్రజలపై వివక్ష, అత్యాచారాలు నిరోధించేందుకు అందరూ కృషి చేయాలన్నారు.

ఇది చదవండి: తమ సమస్యలు అసెంబ్లీలో చర్చించాల్సిందే.. లేకుంటే ఊరుకునేది లేదు..!

ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ హాస్టల్స్ లో పోలీసులు ప్రతిరోజు సాయంత్రం పర్యవేక్షణ ఉంటుందన్నారు. అలాగే పోక్సో చట్టం పైన అవగాహన సదస్సులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జేసీ సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ.., ప్రభుత్వ హాస్టల్స్ నందు సమస్యలు ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్ అధికారులు దృష్టికి కానీ,తమ దృష్టికి కానీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అంతేకాని వారంతకు వారే సొసైటీ, ఆర్గనైజేషన్ లకు చెందిన సభ్యులు అధికారుల అనుమతి లేకుండా వెళ్లకూడదన్నారు.

సీఎం జగన్ (AP CM YS Jagan) ఆదేశాల మేరకు జిల్లాలో ప్రత్యేకంగా ఎస్సీ,ఎస్టీలకు స్మశాన వాటికలు లేని 138 గ్రామాలను గుర్తించి అందులో 104 గ్రామాలకుస్మశాన వాటిల కై 70 ఎకరాల భూమిని కేటాయించామని అన్నారు. మిగిలిన 34 గ్రామాలకి త్వరలో స్మశాన వాటికలకు భూమిని సేకరిస్తామని తెలిపారు.పరిశీలించాలని ఎస్సీ,ఎస్టీలపై వివక్షతను రూపుమాపేందుకు కృషి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News

ఉత్తమ కథలు