D Prasad, News18, Kadapa
కడప (Kadapa) నగరంలో వెలిసిన సుప్రసిద్దమైన ప్రతిష్టాత్మక తిరుమల తొలి గడప, దేవుని కడపలోని శ్రీ లక్షీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈ నెల 23వ తేదీ నుండి వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు అయిన నేడు తెల్లవారుజామున నుండి శ్రీవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక హోమాలు అభిషేకాలు నిర్వహించారు. ఈ రోజు మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు నడుమ దేవుని కడప మాడ వీధులలో శ్రీవారిని కల్పవృక్ష వాహనంపై ఊరేగించారు.
భక్తులు అడుగడుగునా శ్రీవారికి కర్పూర నీరాజనాలు పలికారు లక్ష్మి పుర వీధుల వెంట భక్తుల గోవింద నామస్మరణల మద్య వైభవంగా జరిగిన ఈ వేడుకకి నగరంలోని భక్తజనం విశేషంగా హాజరై శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం అమావాస్య రోజు ప్రారంభమై 28 రథ సప్తమితో ముగుస్తుంది. వైభవంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి రోజు శ్రీనివాసుడు లక్ష్మీ సమేతుడై పలు వాహనాలమీద వైభవంగా పుర వీధుల్లో ఊరేగుతూ పుర వీధుల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ ఉత్సవంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 28వ తేదీన రథసప్తమి సందర్భంగా పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని రోజులకంటే అధికంగా పక్క జిల్లా నుంచి కూడా భక్తులు తరలి రానున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News