హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పురిట్లోనే భారమైన బిడ్డ.. ఆ కసాయి తల్లి ఏం చేసిందో చూడండి..!

పురిట్లోనే భారమైన బిడ్డ.. ఆ కసాయి తల్లి ఏం చేసిందో చూడండి..!

పులివెందులలో డ్రెయినేజీలో శిశువు మృతదేహం

పులివెందులలో డ్రెయినేజీలో శిశువు మృతదేహం

పైశాచికత్వానికి పరాకాష్ట గా నిలిచిన ఘోరమైన సంఘటన కడప జిల్లాలోని పులివెందుల పట్టణంలో వెలుగు చూసింది. ఇలా చేసినవారు. మతి లేనివారయినా అయి ఉండాలి లేదా పచ్చి నెత్తురు తాగే మృగం అయినా అయుండాలి.

  • News18 Telugu
  • Last Updated :
  • Pulivendla (Pulivendula), India

D Prasad, News18, Kadapa

నేటి సమాజంలో ఎంతో మంది పిల్లలు లేక ఎన్నో పూజా పునస్కారాలు చేస్తూ అన్ని మతాల దేవుళ్లని మొక్కుతూ, కనపడిన వైద్యులని సంప్రదిస్తూ ఇలా ఒకటేమిటి ఎన్నో రకాలుగా వారి కి శక్తికి తగినట్లు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి సంతాన భాగ్యం కలగలేదని కుమిలిపోతూ ఉంటారు. అలాంటి వారికి తెలుసు ఆ పిల్లలు లేని బాధ ఏమిటో… పైశాచికత్వానికి పరాకాష్ట గా నిలిచిన ఘోరమైన సంఘటన కడప జిల్లాలోని పులివెందుల పట్టణంలో వెలుగు చూసింది. ఇలా చేసినవారు. మతి లేనివారయినా అయి ఉండాలి లేదా పచ్చి నెత్తురు తాగే మృగం అయినా అయుండాలి. కడప జిల్లా పులివెందుల పట్టణంలో క్రిస్టియన్ కాలనీలో ఒక పసికందు శవమై మురుగు కాలువలో కనిపించింది. నవ మాసాలు మోసి ఏ తల్లి కన్నదో కాని తుదిలోనే ఇలా కడతేరిన పసికందును చూసిన స్థానికులు హృదయ వేదనకి గురవుతున్నారు.

ఈ చిన్నారి ఎటువంటి పరిస్థితులలో ఆ తల్లి కడుపున పడిందో, ప్రాణాలతో పుట్టిందా, లేక ఆ పాప ని పోషించడం బరువై ఇలా పడవేశారా అనే విషయం తెలియదు కాని, నేడు మూగ జీవులు సైతం తమకు పుట్టిన పసి పాపాలని అపురూపంగా చూసుకుంటున్నాయి అలాగే పరిస్థితుల దృష్ట్యా కటిక పేదరికంలో ఉన్న వారు కూడా వారి పిల్లలని ఉన్నంతలో ఆనందంగా పెంచుతున్నారు. అలాంటి సమాజంలో ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన వారు రాక్షస జాతికి చెంది ఉంటారని జనాలు కోడై కూస్తున్నారు.

ఇది చదవండి: పెళ్లైన 15 రోజులకే భార్య, అత్త మర్డర్.. అడ్డొచ్చిన మామని..

ఇటు వంటి సంఘటనలపై నేడు ప్రభుత్వం మరియు ఎన్నో సేవా సంస్థలు నేరంగా భావించి ఎన్నో విధాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాకూడా నేడు ఇలాంటి బ్రూణహత్యలు అక్కడక్కడ క్రమంగా జరగడం చాల విచారకరం.ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠినమైనచర్యలు చేపట్టాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News

ఉత్తమ కథలు