హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఒకప్పుడు వేల మందికి అన్నం పెట్టింది.. ఇప్పుడిలా..!

ఒకప్పుడు వేల మందికి అన్నం పెట్టింది.. ఇప్పుడిలా..!

X
కడప

కడప జిల్లాలో ఉనికి కోల్పోయిన చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ

చెన్నూరు షుగర్ ఫాక్టర. కడప జిల్లా (Kadapa District) లో ఒకప్పుడు చెప్పుకోదగిన వ్యవసాయ పరిశ్రమలో ఒకటి. ఒకప్పుడు నిర్విరామంగా పనులు జరుగుతూ రోజుకు వేల టన్నుల చెరకు నుండి చక్కేరని ఉత్పతి చేస్తూ ఎందరికో ఉపాధినిఅందించేది

  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India

D Prasad, News18, Kadapa

చెన్నూరు షుగర్ ఫాక్టర. కడప జిల్లా (Kadapa District) లో ఒకప్పుడు చెప్పుకోదగిన వ్యవసాయ పరిశ్రమలో ఒకటి. ఒకప్పుడు నిర్విరామంగా పనులు జరుగుతూ రోజుకు వేల టన్నుల చెరకు నుండి చక్కేరని ఉత్పతి చేస్తూ ఎందరికో ఉపాధినిఅందించేది. అప్పట్లో ఈ పరిశ్రమ ఆధారంగా చెన్నూరు, ఖాజీపేట, ప్రొద్దుటూరు వంటి తదితర మండలాల పరిధిలో కొన్ని వేల ఎకరాలలో చెరుకు సాగుబడి సాగేది. కాని ఉన్నఫళంగా ఈ చెరుకు పరిశ్రమనుమూసివేయడంతో నేడు ఆ చెరుకు సాగు వందల ఎకరాలకి పరిమితమయింది.కడప జిల్లాలో ఈ చెక్కర ఫ్యాక్టరీ 1974 లో అప్పటి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి జలగం వెంగళరావు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత 1986లో ప్రారంభమై ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మందికి ఉపాధి అవకాశాలను కల్పించింది.

అప్పట్లో ప్రభుత్వ సహకారంతో రైతులు జిల్లాలో మొత్తం ఏడు నుంచి ఎనిమిది వేల ఎకరాల్లో చెరుకు సాగవుతూ రైతులకి ఎంతో ఆసరాగా ఈ చెరుకు ఫ్యాక్టరీ నిలిచేది. ఆ తరువాత 1995లో పలు కారణాల వల్ల మూతబడింది. సరిగ్గా పదేళ్ల తర్వాత 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR) చొరవతో తిరిగి ప్రారంభించారు. ఐతే యాజమాన్యం నిర్లక్ష్యమో లేక కార్మికుల దురదృష్టమోగానీ మళ్లీ మూబడింది. దీంతో ఈ ఫాక్టరీ మీద ఆధారపడి బ్రతుకుతున్న ఎంతోమంది ఉద్యోగులకి, రైతులకి నిరాశని మిగిల్చింది.

ఇది చదవండి: ఒకేసారి ఐదుగురికి అరుదైన ఆపరేషన్లు.. కర్నూలు డాక్టర్ల రికార్డ్

ఒకప్పుడు వేలాది మంది కార్మికులు, చెరుకు బండ్ల హడావిడితో సందడిగా కనిపించిన చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ ఇప్పుడు పూర్తిగా శిథిలమైంది. ఫరిశ్రమంతా దట్టమైన పొదలు, చెట్లతో అడవిని తలపిస్తోంది. ఒకప్పుడు నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించిన ఈ షుగర్ ఫ్యాక్టరీమీద ఇప్పటికి ఎంతమంది రైతులు, నిరుద్యోగులు ఈ ప్రభుత్వంలోనైనా తిరిగి ప్రారంభానికి నోచుకోదా..! అని ఆశగా ఎదురు చూస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News

ఉత్తమ కథలు