హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kadapa: పంట పండినా నిరాశే..! చామంతి రైతుకి వచ్చిన కష్టం ఇదే..!

Kadapa: పంట పండినా నిరాశే..! చామంతి రైతుకి వచ్చిన కష్టం ఇదే..!

X
నిరాశ

నిరాశ చెందుతున్న రైతు

Andhra Pradesh: పండగ చామంతి రైతుకి కలిసొచ్చిన దండగే.నిలకడ లేని ధరలతో రైతు కుదేలు. పూల సాగుబడిలో ఎన్నో సంవత్సరాలుగా లాభాలలో కలిసొచ్చినా నష్టాలలో కూరుకుపోయినా... వారు నమ్మిన సిద్దాంతం వ్యవసాయం ఒక్కటే.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

D.Prasad, News18, Kadapa

పండగ చామంతి రైతుకి కలిసొచ్చిన దండగే.నిలకడ లేని ధరలతో రైతు కుదేలు. పూల సాగుబడిలో ఎన్నో సంవత్సరాలుగా లాభాలలో కలిసొచ్చినా నష్టాలలో కూరుకుపోయినా... వారు నమ్మిన సిద్దాంతం వ్యవసాయం ఒక్కటే. కడప జిల్లాలోని అన్ని ప్రాంతాల కంటే అత్యధికంగా విస్తారంగా పువ్వుల సాగుబడి చేస్తున్న ప్రాంతం పెండ్లి మర్రి.

ఈ ప్రాంతంలో అన్ని రకాల పూలను పండిస్తారు అంతే కాకుండా ఇక్కడి వారే స్వయంగా వారి పంటలను వ్యాపారస్తుల దగ్గరకి చేరవేసి వారి పంటకు పలికిన ధరకి అమ్ముకుని సొమ్ముతో ఇంటికి చేరుకుంటారు. ఈ ప్రాంతంలో అన్ని రకాల పువ్వుల లోకి చామంతిని అధికంగా సాగు చేస్తున్నారు.ఈ చామంతి సాగులో అధిక పెట్టుబడులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు వంటి వ్యయాలు అధికంగా వున్నా కూడా ఇక్కడి రైతులు ఎక్కువగా చామంతి సాగు చేయడానికి మక్కువ చూపిస్తారు.

మార్కెట్ లో కూడా చామంతికి ఎక్కువగా డిమాండ్ ఉంటుంది.ఇక్కడి ప్రాంతంలో చామంతిలోని రబ్బర్ చామంతి, బుల్లెట్, తెల్ల చామంతి, చాందిని, వంటి రకాలని అధికంగా పండిస్తారు. వీటిలో అధికంగా మన్నిక కలిగిన రకాలు మార్కెట్ లో డిమాండ్ కలిగిన పువ్వుల రకాలని పండిస్తారు. వీటి సాగు చాల ఖర్చుతో కూడుకున్న పని. వాతావరణ మార్పులు, వర్షాలు, కొన్ని రకాల తెగుళ్ళు ఈ చామంతి రైతులకి ప్రధాన శత్రువులుగా మారుతున్నాయి.

ఇక ధరల విషయానికి వస్తే ఈ చామంతి సాగులో అతి కనిష్టంగా, గరిష్టంగా ఒక నిర్దిష్టమైన ధరని కలిగి ఉండక, నిరంతరం మారుతూ ఉంటాయని, సీజన్ ని బట్టి ఏపండక్కో, పబ్బానికో కాస్త ధర పలికినా ఆ ఆనందం కొద్ది రోజులే అని రైతులు వాపోతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News

ఉత్తమ కథలు