హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big Shock: పసుపు బాగా పండిందని సంబర పడ్డారు.. పొలంలోకి వెళ్లి షాక్ కు గురైన రైతు.. ఏం జరిగింది అంటే?

Big Shock: పసుపు బాగా పండిందని సంబర పడ్డారు.. పొలంలోకి వెళ్లి షాక్ కు గురైన రైతు.. ఏం జరిగింది అంటే?

పసుపు రైతుకు బిగ్ షాక్

పసుపు రైతుకు బిగ్ షాక్

Big Shock to Farmer: పంట బాగా వచ్చిందని ఎంతో సంబర పడ్డాడు. ఈ సారి భారీగా లాభం వస్తుందని ఆశించాడు.. పంటను చూసుకునేందుకు.. పొలానికి వెళ్లిన ఆ రైతుకు ఊహించని షాక్ తగిలింది. ఏం జరిగిందో తెలుసా..?

 • News18 Telugu
 • Last Updated :
 • Kadapa (Cuddapah), India

  GT Hemanth Kumar, Tirupathi, News18Big Shock to Farmer:  నిత్యం చాలా వింతలు విశేషాలు జరుగుతూనే ఉంటాయి. అలాంటివాటిలో కొన్ని సందర్భాల్లో మనల్ని ఆశ్చర్యానికి గురి చేసే ఘటనలు జరుగుతుంటాయి. ఇదేలా జరిగింది అని షాక్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. ప్రకృతి ప్రకోపానికి గురైతే భూ కంపాలు, సునామి, వరదలు వంటి సంఘటనలు సంభవిస్తుంటాయి. కొన్ని సంఘటనలు చూస్తే మనకు నవ్వు రాక మానదు.. మరికొన్ని చూస్తే భయం వేస్తూ ఉంటాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో  కరువు సీమలోను వరుణ దేవుడు.. వర్షాలు భారీగా కురిపిస్తున్నాడు. ఈ ఏడాది వేసవి కాలం నుంచే రుతు రాగాలు అందుకున్నాయి. పుష్కలమైన వర్షాలు, సంవృద్ధిగా కురిశాయి.
  తాజాగా ఉమ్మడి కడప జిల్లాలో వింతైన ఘటన చోటు చేసుకుంది. ప్రతి రోజూ మాదిరిగానే రైతు.. తన పొలంలో వెళ్లి చూసాడు. పొలంలో జరిగిన ఘటన చూసి ఒక్కసారిగా షాక్  అయ్యాడు. అయ్యో పంట బాగా పండిందని ఆనందంలో ఉంటే.. ఇలా జరిగింది ఏంటి అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
  ఆ షాక్ నుంచి తేలుకున్న వెంటనే దగ్గరలో ఉన్న స్థానికులకు, అధికారులకు సమాచారాన్ని చేరవేసాడు. ఘటన స్థలంలోకి చేరుకున్న అధికారులు సైతం ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు. గ్రామస్థులు భయాందోళనకు గురి అవుతున్నారు. అసలు ఆ పొలంలో ఏమైంది..? అక్కడ జరిగిన ఘటన ఏంటి..?  గ్రామస్థులు ఎందుకు భయపడుతున్నారు..?


  ఇదీ చదవండి : మళ్లీ మళ్లీ మంత్రులను మార్చడం ఎందుకు.. జగన్ నే మార్చేస్తే పోలే..
  కడప జిల్లాలో ఓ రైతు వింత అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. రోజులానే తన పసుపు పొలానికి వెళ్లిన రైతకు పొలంలో భారీ గొయ్యి కనపడింది. చింత కొమ్మదిన్నె మండలం  బయనపల్లి మండలంలో ఈ ఘటన వెలుగుచూసింది. విష్ణు వర్ధన్​ రెడ్డి అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలో పసుపు వేశాడు. బుధవారం వెళ్లి చూసేసరికి పొలం నడి మధ్యలో భూమి కుంగిపోయి.. పెద్ద గొయ్యి ఏర్పడింది.
  ఇదీ చదవండి : కూరగాయ పంటలతో ఇన్ని లాభాలా..? వేటిపై పెట్టుబడి పెట్టొచ్చంటే..?
  ఈ గొయ్యి పొడవు.. లోతు దాదాపు 30 అడుగుల మేర కనిపిస్తోంది. ఈ భారీ గుంత లోపల వాటర్ ఉన్నాయి. నడిచేలో ఇలా జరగడంతో సదరు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పావు ఎకరం మేర పంట పోయిందని.. అదీ కాక ఇకపై పొలానికి నీళ్లు వేయడం.. క్రిమి సంహారక మందులు పిచికారి చేయడం కుదరదని ఆవేదన వ్యక్తం చేశాస్తున్నాడు.  చింతకొమ్మదిన్నె మండలంలో ఇలా జరగడం మొదటిసారి కాదన్నారు.
  ఇదీ చదవండి : పెట్టుబడి లేని వ్యవసాయం.. లాభాలే లాభాలు.. ప్రయోజనాలూ ఎన్నో..?
  గతంలో కూడా కొన్నిసార్లు ఇలానే జరిగింది అంటున్నారు.. తాము పొలంలో ఉన్నప్పుడు ఇలా గుంతలు ఏర్పడితే ప్రాణాలకే ప్రమాదం అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదని.. ఈ సమస్యకు అధికారులు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Farmer, Kadapa

  ఉత్తమ కథలు