హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Big Shock: ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్.. వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన నిర్ణయం..

Big Shock: ఏపీ ప్రభుత్వానికి ఊహించని షాక్.. వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన నిర్ణయం..

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

Big Shock: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది సుప్రీం కోర్టు.. పెను సంచలనంగా మారిన వైఎస్ వివేకా హత్య కేసులో.. కీలక నిర్ణయం తీసుకుంది.. పూర్తి తీర్పును శుక్రవారం వెల్లడించనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India

Big Shock: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పెను సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి (YS Vivekanandha Reddy) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్‌పై సుప్రీం కోర్టు (Supreme Court) లో సీబీఐ కౌంటర్‌ (CBI Counter) అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఎందుకంటే తన తండ్రి వైఎస్‌ వివేకానంద హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎంఆర్‌ షా, జస్టిస్‌ కృష్ణమురారి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయటానికి సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ కేసును ఏ రాష్ట్రానికి బదిలీ చేయాలనుకుంటున్నారు? అంటూ పిటీషనర్ ను ధర్మాసనం ప్రశ్నించింది. తరువాత తీర్పును సుప్రీం రిజర్వ్ చేసింది. వచ్చే శుక్రవారం తీర్పు వెల్లడిస్తామని పేర్కొంది ధర్మాసనం.

మొదట నుంచి సునీత రెడ్డి.. ఈ కేసు విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ పోలసీులు,, విచారణ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. దీనిలో భాగంగా తన తండ్రి హత్యా కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని సునీతారెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారించిన సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె ఆవేదనను అర్థం చేసుకుని కేసు విచారణు వేరే రాష్ట్రానికి మార్చేందుకు అంగీకరించింది. తరువాత తీర్పును రిజర్వ్ చేసింది.

సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. ఈ సందర్భంగా పలు కీలక విషయాల్ని సీబీఐ కోర్టు వివరించింది. సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ చాలా కీలక విషయాలు వెల్లడించింది. ఈ కేసులో నిందితులు.. దర్యాప్తు విచారణాధికారిపైనే తిరిగి కేసులు పెట్టారని పేర్కొంది. మేజిస్ట్రేట్ ముందు 164 స్టేట్‌మెంట్ ఇస్తామన్న పోలీసు అధికారి శంకరయ్యకు ఏపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చిందన్నారు. అయితే ఆ ప్రమోషన్ వచ్చిన తర్వాత శంకరయ్య.. తనపై సీబీఐ ఒత్తిడి తెచ్చి, 164 స్టేట్‌మెంట్ అడిగినట్లు లేఖ రాశారంటూ ఆ నివేదికలో పేర్కొంది.

ఇదీ చదవండి పవన్ తో పొత్తు విషయంలో కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు.. తప్పంతా సోమువీర్రాజుదే అంటూ ఫైర్

పిటిషినర్ ఆరోపించినట్టు రాష్ట్ర పోలీసులు, నిందితులు కుమ్మక్కు అయిన మాట వాస్తవమే అన్నారు. అందుకే విచారణలో జాప్యం జరుగుతోందని వివరించారు. హత్య జరిగిన తర్వాత నిందితులు చెప్పినట్లుగా స్థానిక పోలీసులు వ్యవహరించారని.. నిందితుల్ని విచారణ జరిపి, చార్జిషీటు దాఖలు చేయాల్సిన పోలీసులు.. చార్జిషీటు ఆలస్యం చేసి వారికి సహకరించారు అని సీబీఐ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో పేర్కొంది.

ఇదీ చదవండి: వరద ప్రాంతాల బాధితులకు అండగా బాలయ్య.. ఆయన్ను చూసేందుకు నదిలో దూకేసిన అభిమాని.. ఈత రాక ఏం జరిగింది అంటే?

దీనిలో అన్ని అంశాల్ని పూర్తిగా వివరించినట్లుగా సమాచారం. సునీతా రెడ్డి వాదనలు అన్నింటికీ సీబీఐ మద్దతు తెలిపి.. ఆమె చెప్పేవన్నీ నిజాలేనని స్పష్టం చేసింది. దీంతో కోర్టు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి అంగీకరించింది. అదే జరిగితే సునీత రెడ్డి ఆరోపణలు చేస్తున్న కొందరు కీలక నేతలకు ఇబ్బందులు తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, Ap government, AP News, Supreme Court, Ys viveka murder case