D.Prasad, News18, Kadapa
ప్రకృతి అప్పుడప్పడూ అందమైన వింతలతో అబ్బుర పరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వున్న వింతలు విశేషాలు గురించి పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో చూడటం, చదవటం చేస్తూ ఆశ్చర్యపోతు వుంటాం. అలాంటి వింత మన దగ్గరలో వుందoటే, ఆరా తీయడం మాని వెంటనే అక్కడికి పరుగున వెళ్లి చూసొస్తాం. అలంటి వింత మన్ దగ్గరలో వుంది. అదేమిటి అనుకుంటున్నారా... ప్రపంచంలో అందమైన అరుదైన జైంట్ వాటర్ లిల్లీ అనే మొక్క మన కడప గడపలో సందర్శకులను ఆకర్షిస్తుంది.
మన జిల్లాలో యోగివేమన యూనివర్సిటీ లో బొటానికల్ గార్డెన్లో ప్రపంచంలోనే అతి పెద్ద పత్రం కలిగిన విక్టోరియా అమెజోనికావిద్యార్థులను సందర్శకులను విశిష్టంగా ఆకట్టుకుంటుంది.అందమైన ఈ అరుదైన మొక్కలు చూడడానికి ఎంతో మంది సందర్శకులు వస్తూ ఈ మొక్కని ఆసక్తిగా తిలకిస్తూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
అంతే కాదండయ్. ఈ వింతైన మొక్కలలో మరిన్ని అబ్బురపరిచే విశేషాలు దాగి ఉన్నాయి. అవి ఏమిటంటే ఈ మొక్కలో గల ఆకు సుమారు 3 మీటర్ల వరకు పెరుగుతుంది. అంతే కాకుండా ఆకుల ఈనెలు దళసరిగా వుండటం వలన సుమారు 40 కేజీల వరకు బరువును మోయగలుగుతుంది. ఇది వరకే ఇక్కడ చిన్న పిల్లలకి కూర్చోపెట్టి పరీక్షించారు కూడా.. ఇక అందమైన పుష్పం ఈ మొక్కలకి మరింత అందాన్ని తీసుకొస్తుంది. ఈ పుష్పం ఉదయం సూర్య కాంతిలో తెల్లటి తెలుపు వర్ణంలో సాయంత్రం అయితే లేత గులాబీ రంగులో మనకు దర్శనం ఇస్తుంది.
కేవలం రెండు మొక్కలు తీసుకొచ్చి అసిస్టెట్ ఫ్రొఫెసర్మరియు ఈ బొటానికల్ గార్డెన్ నిర్వాహకులు డాక్టర్ ఎ. మధుసూదన్ రెడ్డిబొటానికల్ గార్డెన్లో నాటడం జరిగింది. ఆ రెండు మొక్కలే నేడు వందలు, వేలుగా వృద్ది చెంది కొలను మొత్తం అందంగా విస్తరించి ఆకట్టుకుంటున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News