హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kadapa: నిరుద్యోగ యువతకు శుభవార్త..!

Kadapa: నిరుద్యోగ యువతకు శుభవార్త..!

జాబ్ న్యూస్

జాబ్ న్యూస్

Andhra Pradesh: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు చక్కటి శుభవార్త.నగరంలోని ఖాళీగా వున్న నిరుద్యోగులకుచక్కటి అవకాశం. మన కడప జిల్లా ఉపాధి కార్యాలయం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ APSSDC మరియు DRDA(SEEDAP) సంస్థ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నగరంలోని నిరుద్యోగుల కొరకు మినీ ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

D.Prasad, News18, Kadapa

జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు చక్కటి శుభవార్త.నగరంలోని ఖాళీగా వున్న నిరుద్యోగులకుచక్కటి అవకాశం. మన కడప జిల్లా ఉపాధి కార్యాలయం జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ APSSDC మరియు DRDA(SEEDAP) సంస్థ వారి ఆధ్వర్యంలో సంయుక్తంగా నగరంలోని నిరుద్యోగుల కొరకు మినీ ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుంది.

ఈ ఉద్యోగ మేళాని 27/01/2023 తేది అనగా వచ్చే శుక్రవారం నాడు ఉదయం 10 ,00 గంటలకు కడప నగరంలోని కొత్త కలెక్టరేట్ భవనంలోని జిల్లా ఉపాధి కార్యాలయం నందు రెండు ప్రముఖమైన కంపెనీలతో మినీ ఉద్యోగ మేలా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.ప్రముఖ కంపెనీలు HCL (tech bee programme) నందు పని చేయుటకు IT software associate మరియు LIC (life insurance corporation of India) నందు పని చేయుటకు RCA, CCA ఏజెంట్స్ కొరకు జరుపుతున్న ఈ ఉద్యోగ మేళాలో SSC, ఇంటర్ ఏదైనా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణులైన మహిళా మరియు పురుష అభ్యర్థులు అర్హులుగా ఉంటారని తెలిపారు.

అభ్యర్థుల వయస్సు సుమారు 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవలెనని ప్రకటనలో తెలిపారు. అలాగే, అర్హులైన అభ్యర్థులు వారి యొక్క విద్యార్హతలకి సంబంధించిన ధ్రువపత్రాలు మరియు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకొని ఈ ఉద్యోగామేళాకు హాజరు కావలెనని కోరారు.ఆసక్తి కలిగిన వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మహిళా మరియు పురుష అభ్యర్థి అభ్యర్థులు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొని వారికి తగిన ప్రైవేటు ఉద్యోగం పొంది ఈ ఉద్యోగా మేళాని విజయవంతం చేయవలసినదిగా జిల్లా ఉపాధి అధికారి శ్రీమతి దీప్తి తెలిపారు.

అదే విధంగా ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు మీయొక్క వివరములు డబ్ల్యూ www. ncs. gov. in నందు రిజిస్టర్ చేసుకోవలసినదిగా కోరారు. ఈ ఉద్యోగమేళా గురించిన ఇతర సమాచారం తెలుసుకొనుటకు 9063623706, 9908051624 నెంబర్లకు కాల్ చేసి తెలుసుకోగలరు.

First published:

Tags: Andhra Pradesh, JOBS, Kadapa, Local News

ఉత్తమ కథలు