Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మరో హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.. మూడు రోజుల పాటు కుండపోత వానలు కుమ్మేసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. పలు జిల్లాలకు సూపర్ సైక్లోన్ (Super Cyclone) ముప్పు ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేస్తోంది. దీంతో ఏపీకి భారీ వర్షాలు (Heavry Rains), వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18 న ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం.. ఏర్పడనుంది. ఈ నెల 20 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా ఏపీ వైపు పయనం కానుందని అంచనా వేస్తోంది. తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుఫాను ఏర్పడితే సిత్రంగ్ గా నామకరణం చేయనున్నారు. సూపర్ సైక్లోన్ అవకాశాలను గ్లోబల్ ఫో ర్ కాస్ట్ సిస్టమ్ (జీ.ఎఫ్.ఎస్) గుర్తించింది. సూపర్ సైక్లోన్ ఏర్పడితే ఏపీ, ఒడిషా, బెంగాల్ రాష్ట్రాలపైన ప్రభావం ఉండనుందని ఇప్పటికే గుర్తించారు.
ఇప్పటికే ఏపీలో పలు జిల్లాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాయలసీమలోనూ వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. ఇప్పుడు మరింత భయపడాల్సి వస్తోంది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చే సింది.. పలు ప్రాంతాల్లో ఆకాశానికి చిల్లుపడినట్టు వానలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లు తున్నాయి.
Big Alert || Super Cyclone for Andhra Pradesh || ఏపీకి భారీ తుఫాను ఎఫెక్... https://t.co/FDM9knmD0U via @YouTube #cyclones #CycloneSZN #rain #RAINCODE #rainbow6siege #rainbowfriendsfanart #rainbowfriendsAu #rainbow6siege
— nagesh paina (@PainaNagesh) October 15, 2022
అక్టోబర్ 20 నాటికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ పశ్చిమ మధ్య.. ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో.. రాష్ట్రంలో రాబోవు మూడు రోజులు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.. ఇక ఆదివారం రోజు.. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు , పల్నాడు, బాపట్ల, నంద్యాల, కర్నూలు , అనంతపురం , శ్రీ సత్య సాయి జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉండగా.. మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది..
ఇదీ చదవండి : విశాఖ చేరుకున్న జనసేనాని.. దాడిపై వెంటనే స్పందించాలని మంత్రుల డిమాండ్
ఇక, సోమవారం రోజు అల్లూరి సీతారామరాజు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి , పశ్చిమ గోదావరి, ఏలూరు, పల్నాడు, శ్రీసత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు.. మంగళవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని.. అలాగే మిగిలిన చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: ఉత్తరాంధ్రలో టీడీపీ, జనసేన బ్యాన్ చేయాలి.. అమరావతి గ్రాఫిక్స్ మాత్రమే అంటూ మంత్రుల ఫైర్
వర్షాలు నేపథ్యంలో కృష్ణా, పెన్నా నదులు వరద ప్రవహించే అవకాశం ఉన్నందున నదీపరీవాహక ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని, లోతట్టు ప్రాంతప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని.. హెచ్చరిస్తోంది. అధికారులు అలర్ట్ గా ఉండాలని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra Pradesh Weather, AP News, Heavy Rains, Weather report