D.Prasad, News18, Kadapa
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (APSLPRB) 22 న ఆదివారం నిర్వహించనున్న పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరిక్షలకు భద్రతా పరమైన అంశాలు మరియు ఏర్పాట్లపై కడప నగరంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీసు అధికారులు, రీజినల్ కోఆర్డినేటర్ మరియు సెంటర్స్ చీఫ్ సూపరింటెండెంట్లతో గురువారం జిల్లా ఎస్పీ కె.కె.ఎన్ అన్బురాజన్ సమావేశం నిర్వహించారు.
పరీక్షలు నిర్వహించు కేంద్రాల వద్ద చేయవల్సిన వివిధ ఏర్పాట్లను, తీసుకోవాల్సిన జాగ్రత్తలుఅనుసరించ వలసిన నియమ నిబందనలపై అధికారులకు పలు సూచనలు చేసారు. సమీక్ష అనంతరం కానిస్టేబుల్ నియామక పరీక్షా పత్రాలు భద్రపరచే కడప నగరంలోని పాత కలెక్టరెట్ లో ఉన్న ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్, CC TV కెమెరాల ఏర్పాటు, పనితీరును పరిశీలించారు.
స్ట్రాంగ్ రూముల రక్షణకు సంబంధించి కో-ఆర్డినేటర్స్, పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ఆర్ముడ్ గార్డ్ లను ఏర్పాటు చేసి అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్మెంట్ APSLPRB పరీక్షలకు కడప మరియు ప్రొద్దుటూరు లో ఆయా కేంద్రాల వద్ద పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి పటిష్ట భద్రత మరియు అన్ని ఏర్పాట్లను నిబందనల ప్రకారం పూర్తి చేస్తున్నామని, పరీక్షలకు ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రతి పరీక్ష కేంద్రం వద్ద గట్టి భద్రతా, పటిష్ట బందో బస్త్ చర్యలను చేపడుతున్నామని, పోలీసు అధికారులు, రీజనల్ కోఆర్డినేటర్లతో పకడ్బందీ చర్యలతో పాటు ఎక్కడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
పరీక్ష వ్రాసే అభ్యర్థులందరూ నియమ నిబంధనలను పాటిస్తూ సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని, క్రమశిక్షణ పాటిస్తూ పరీక్షలను శ్రద్దగా వ్రాసి ఉత్తీర్ణులు కావాలని అకాంక్షిస్తున్నానని జిల్లా ఎస్పీ గారు తెలిపారు. పరీక్షకు హాజరయ్యేవారు సెల్ ఫోన్లు, అలాగే ఇతరత్రా ఎలాంటి ఎలెక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, పర్సులు అనుమతించరన్నారు. హాల్ టికెట్, బాల్ పాయింట్ పెన్ మినహా ఇతర ఎలాంటి వస్తువులు అనుమతించబడవని ఎస్.పి వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News