హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: ఎకౌంట్ ఫ్రీజ్ అయిందని కంప్లైంట్ చేస్తే షాకింగ్ సీన్.. వీళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్..!

AP News: ఎకౌంట్ ఫ్రీజ్ అయిందని కంప్లైంట్ చేస్తే షాకింగ్ సీన్.. వీళ్లు మామూలోళ్లు కాదు బాబోయ్..!

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Shocking: ఇటీవల సమాజంలో సైబర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోయాయి. ఇంటికి కన్నం వేసే దొంగలకంటే ఫోన్లలో మాయ చేసి ఎకౌంట్లు ఖాళీ చేసే కేటుగాళ్లు పెరిగిపోయారు. మోసపోయే వాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటాడు అనే విధంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.

ఇంకా చదవండి ...

GT Hemanth Kumar, News18, Tirupati

ఇటీవల సమాజంలో సైబర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోయాయి. ఇంటికి కన్నం వేసే దొంగలకంటే ఫోన్లలో మాయ చేసి ఎకౌంట్లు ఖాళీ చేసే కేటుగాళ్లు పెరిగిపోయారు. మోసపోయే వాడు ఉన్నంత వరకు మోసం చేసేవాడు ఉంటాడు అనే విధంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఒక్క ఫోన్ లేదాఒక్క లింక్ తో మీ ఖాతాలో నగదును మొత్తం మాయం చేసేస్తారు సైబర్ దొంగలు. ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయింది. ఎందుకు ఫ్రీజ్ అయిందో తెలియదని బ్యాంక్ అధికారులను ఆశ్రయించిన ఖాతాదారుడు. అనుమానం వచ్చిన బ్యాంకు సిబ్బంది పోలీసాను ఆశ్రయించారు. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోని విచారించిన విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అన్నమయ్య జిల్లా (Annamayya District) చిట్వేలు మండలం టి కందులవారి పల్లెలో నివాసం ఉంటున్నాడు సాయి కిరణ్. రెండు రోజుల క్రితం ఏటీఎంకు వెళ్లి నగదు విత్ డ్రా చేసేదుకు ప్రయత్నం చేసాడు. 10 వేల రూపాయలు నగదు డ్రా చేసే ప్రయత్నం చేయగా... మీ బ్యాంకు ఖాతా ఫ్రీజ్ అయిందన్న మెసేజ్ వచ్చింది. దీంతో సాయి కిరణ్ బ్యాంకు అధికారులను ఆశ్రయించారు. బ్యాంకు ఖాతాపై అనుమానం వచ్చిన సిబ్బంది వెంటనే సాయి కిరణ్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ పై గోప్యంగా సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చే వరకు సాయి కిరణ్ ను మాటల్లో దింపి తనకు కావాల్సిన సమాచారం ఇచ్చేలా కాలయాపన చేశారు.

ఇది చదవండి: ఆమె వయసు 54.. మేకప్ తో 30 ఏళ్లలా మేనేజ్ చేసి పెళ్లి చేసుకుంది.. ఆ తర్వాత..


అక్కడికి చేరుకున్న పోలీసులు సాయి కిరణ్ సైబర్ నేరగాడిగా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ సైబర్ మోసాలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. సాయి కిరణ్ పై కోల్ కతాలో పలు కేసులు నమోదు అయినట్లు తెలుసుకున్నారు ఏపీ పోలీసులు. సాయి కిరణ్ మూడు నెలల వ్యవధిలో 7 వేలకు పైగా ట్రాన్సక్షన్స్ చేసినట్లు గుర్తించారు. దీనికి తోడు 30 సిమ్ కార్డులు వినియోగించినట్లు నిర్ధారణకు వచ్చారు.

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఖాతాలను హ్యాక్ చేసి కోట్లాది రూపాయలు కాజేశాడు. హ్యాకింగ్ ను వృత్తిగా చేసుకున్న సాయికిరణ్ ఖాతా చూసి షాక్ కుగురైయ్యారు బ్యాంక్ అధికారులు. 7 వేలకు పైగా లావాదేవీలు జరపడం పై అనుమానం వచ్చి ముందుగా ఖాతాను బ్లాక్ చేశారు. అదే సమయంలో అతని ఖాతా బ్లాక్ లో ఉందని బ్యాంకుకు వెళ్లడంతో సాయికిరణ్ బాగోతం బయటపడింది. కొన్ని ఖాతాల నుంచి భారీగా డబ్బులు కాజేసినట్లు తెలిసింది. దీంతో సాయి కిరణ్., అతనికి సహకరించిన ప్రశాంత్ ను అదుపులోకి తీసుకోని కలకత్తా పోలీసులకు అప్పగించారు.

First published:

Tags: Andhra Pradesh, CYBER CRIME, Kadapa

ఉత్తమ కథలు