MLC Graduate Result 2023: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) సంచలనంగా మారాయి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు (Graduate MLC Elections Results). మూడు చోట్ల ఎన్నికలు జరిగితే మూడు చోట్ల ప్రతిపక్ష టీడీపీ (TDP) గెలుపొందింది. అది కూడా గత అసెంబ్లీ ఎన్నిల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లోనూ టీడీపీ జెండా ఎగరడం సంచలనంగా మారింది. అయితే అందులో ఉత్తరాంధ్ర (North Andhra), తూర్పు రాయలసీమ (East Rayalaseema) గ్రాడ్యుయేట్ ఫలితాలు ముందే తేలిపోయాయి. కానీ పశ్చిమ రాయలసీమ (West Rayalaseema) ఫలితం వివాదాస్పదమైంది.. మూడు రోజుల పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు ముచ్చెమటలు పట్టించింది. చివరికి రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumireddy Ramgopal Reddy) వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి (Vennapusa Ravindra Reddy) పై 7543 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ విజయంపై అధికార వైసీపీ తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చింది. ముఖ్యంగా వైసీపీకి పడ్డ ఓట్లన్నీ.. టీడీపీ బండిల్స్ లో కలిపేశారంటూ ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఎలా ఉన్నా..? టీడీపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు అధికారులు. అయితే డిక్లరేషన్ ఇవ్వలేదు.
దీంతో తెలుగు దేశం పార్టీ ఆందోళనకు దిగింది. దీంతో కౌంటింగ్ కేంద్రం దగ్గర రాత్రంతా హైడ్రామా నడిచింది. శనివారం రాత్రి 8 గంటలకు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినా, అర్ధరాత్రి 12 గంటల దాటిన ఎందుకు ధ్రువీకరణపత్రం ఎందుకు ఇవ్వలేదని.. ప్రశ్నిస్తూ నినాదాలు చేశారు. అధికారుల తీరును తప్పుపడుతూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు పార్థసారథి, కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరాం ఇతరులు ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా కనిపించింది.
కలెక్టర్ నాగలక్ష్మి వాహనాన్ని అడ్డుకుని ప్రయత్నం చేశారు. దీంతో వారిని అరెస్టు చేసి, మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీనిపై ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. స్టేషన్ దగ్గర కూడా నిరసన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి 1.30 వరకూ నేతలను పోలీసు స్టేషన్‌లోనే ఉంచారు. గెలిచిన తరువాత కూడా డిక్లరేషన్ ఇవ్వలేదని టీడీపీ నేతలు.. ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. గెలిచిన అభ్యర్థికి ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదని అధికారులను ప్రశ్నించింది. వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీడీపీ నేతలకు ఫోన్ చేసి డిక్లరేషన్ ఇస్తామం రమ్మని చెప్పారు.
ఇదీ చదవండి : సీఎం జగన్ ఇలాఖాలో టీడీపీ గెలుపు.. ఈసీకి వైసీపీ ఫిర్యాదు.. సజ్జల సంచలన వ్యాఖ్యలు
మరోవైపు ఈ విజయంలో పులివెందుల ఓటర్ల తీరు చర్చనీయాంశంగా మారింది. అక్కడ నుంచి ఎక్కువంది టీడీపీకి ఓటు వేశారనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా హోరెత్తుతోంది.. జగన్ పని అయిపోయిందని.. పులివెందుల ఓటర్లే ఆయన్ను తిరస్కరిస్తున్నారని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు హోరెత్తుతుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kadapa