D Prasad, News18, Kadapa
ప్రతి పల్లెలో తప్పక కనిపించే చెట్టు వేప.. ఇప్పటికీ చాలా మంది వేపతోనే పండ్లను తోముకుంటారు.. కానీ పట్టణాల్లో మాత్రం అక్కడక్కడే వేప చెట్టు దర్శనమిస్తుంది. వేప ఆకు కాని.. లేద చిన్న ముక్క నోట్లో పెట్టుకున్నా.. బాబోయ్ ఇదేమి చేదు అనిపించక మానదు.. కానీ వేపలో అణువణువునా ఔషద లక్షణాలు ఉంటాయి. అందుకే వేప ఎంతో ఆరోగ్యం అంటారు మన పెద్దలు. భారతీయ సంస్కృతిలో వేప చెట్టుకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. మన సమాజంలో దైవంగా భావిస్తూ, పూజలు చేసే వేప చెట్టు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.
పల్లెల్లో అయితే రోజువారి జీవనంలో వేప చెట్టుతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. మన జీవనం వేప పుల్లలు పళ్ళు నోటిని శుభ్ర పరుచుకోవడానికి, వేప విత్తనాలు ఎరువులుగా, నూనెగా, మొక్కలలో క్రిమి సంహారినిగా ఉపయోగపడతాయి. అలాగే ఆకులు, వేర్లు, బెరడు వంటి భాగాలు ఔషధాల తయారీలో అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ప్రయోజనాలను కలిగించే స్వభావం వేపకి కలిగి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా మన భారతీయ సనాతన ధర్మంలో వేప చెట్టుకు అధిక ప్రాధాన్యత ఉంది. పురాణాలలో వేప చెట్టును సాక్షాతూ లక్ష్మీ దేవిగా అభివర్ణించారు.
అనేక సంవత్సరాలుగా భారతీయ ప్రాచీన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం వేప అనేది అన్ని ఔషధాలలోకీ రారాజు. చర్మం మెరవడానికి.. జుట్టు రాలకుండా ఉండానికి, జీర్ణ క్రియను పెంపొందించడానికి, శ్వాస సమస్యలు తొలగించడానికి, మధుమేహ సమస్యల నివారణకు ఈ వేప చెట్టు ఉపయోగపడుతుంది.
ఇలాంటి అనేకమైన వైద్య ప్రక్రియల్లో వేప చెట్టుని వాడుతున్నట్లు చరిత్రలు చెపుతున్నాయి. ఇలా ఎన్నో అనేకమైన ప్రయోజనాలు కలిగి వున్న వేప చెట్టు మన భారతీయ సంపద అని చెప్పుకోవడానికి గర్వకారణం. కొన్ని అనివార్య పరిస్థితులలో నేడు వేప చెట్టు ప్రమాదానికి గురవుతుంది. ఈ వేప చెట్టుని అనేకమైన వస్తు సామాగ్రి కొరకు ఉపయోగించడంతో విపరీతంగా చెట్లను నరికేస్తున్నారు. మరో వైపు వేప చెట్లకి మాత్రమే సోకే కొన్ని రకాల తెగుళ్ల కారణంగా, నేటి కాలుష్యానికి వాతావరణంలో చోటు చేసుకునే అనేకమైన రసాయనిక మార్పులతో వేప చెట్టుకి ముప్పు వాటిల్లుతుంది.
ఉదాహరణకు ఒకప్పుడు ఉన్న వేప చెట్ల సంఖ్యతో పోలిస్తే నేడు చాల వరకు ఆ సంఖ్య కనుమరుగవుతూ వుంది. మన పరిసరాలలో వుండే వేప చెట్లని మనమే అంతమొందిస్తున్నాం. వేప చెట్లు మన భారతీయ సంస్కృతిలో దైవం వంటిది, అంతే కాకుండా ఆరోగ్యానికి అమ్మ వంటిది. వేప చెట్టు మన పరిసరాలలో ఉన్నాకూడా వేప చెట్టు ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద నిపులు చెబుతున్న కారణంగా.. వాటిని బాధ్యతగా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Health benifits, Kadapa