హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Crime News: అన్నపై పగ పెంచుకుంది.. ఆ కసితో మేనల్లుడ్ని మేనళ్లుడ్ని టార్గెట్ చేసింది.. చివరికి ఏమైందంటే?

Crime News: అన్నపై పగ పెంచుకుంది.. ఆ కసితో మేనల్లుడ్ని మేనళ్లుడ్ని టార్గెట్ చేసింది.. చివరికి ఏమైందంటే?

అన్నపై పగ పెంచకున్న చెల్లి

అన్నపై పగ పెంచకున్న చెల్లి

Crime News: ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవద్దని అన్నయ్య అడ్డుపడ్డాడు. దీంతో అన్నయ్యపై పగ పెంచుకున్న ఆ చెల్లి.. చివరికి మేనళ్లుడ్ని టార్గెట్ చేసింది.. చివరికి ఏం చేసింది అంటే..?

 • News18 Telugu
 • Last Updated :
 • Kadapa (Cuddapah), India

  Crime News:  సమాజంలో జరుగుతున్న కొన్ని ఘటనలు రక్త సంబంధాలనే ప్రశ్నించేలా చేస్తున్నారు. అన్న చెల్లి బంధం (Brother and sister) ఎంత పవిత్రమైనదో ప్రత్యేకించి.. చెప్పక్కర్లేదు.. కానీ కొంతమంది ఆ బంధానికి ఉన్న విలువను దిగజారుస్తున్నారు. సాధారణంగా అన్న చెల్లెళ్లు మధ్య ఎంత ప్రేమ, ఆప్యాయతలు (Love and Affectation) ఉంటాయో..? వారి పిల్లలపైనా అదే ప్రేమాభిమానులు ఉంటాయి.. మేనత్త, మేనమామ అంటే ఆ పిల్లలు సైతం చాలా ప్రేమగా ఉంటారు..  చిన్నపిల్లలు వారితోనే  ఎక్కువగా గడపాలి అనుకుంటున్నారు. సరదగా ఉంటారు. అయితే అన్న లేదా తమ్ముడు బిడ్డలు అంటే  మేనత్తలు చాలా ప్రేమగా చూసుకుంటారు.  కానీ కడప జిల్లాలో ఓ కసాయి మేనత్త.. ఉదంతం  కలకలం రేపింది. ఏం జరిగింది అంటే?

  తన ప్రేమ వివాహానికి (Love Marraige) అడ్డు చెప్పాడని.. తోడబుట్టిన అన్నపై కోపం పెంచుకుంది.. ఆ కోపాన్ని పగగా మార్చుకుంది.  ప్రేమ వివాహం చేసుకున్న తరువాత అన్నయ్య  దగ్గరకు రానీయలేదు. దీంతో అన్నపై రోజు రోజుకూ పగ పెంచుకుంది. అప్పటి నుంచి సమయం కోసం ఎదురుచూస్తోంది. అదే సమయంలో అన్న వదినలు.. బతుకు తెరువుకోసం కువైట్ వెళ్ళగానే.. అన్న కొడుపై తన ప్రతాపం చూపించింది.

  స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. కడప (Kadapa)లో నివాసం ఉంటున్నారు శివ కుమార్ (Shivakumar) , భాగ్యలక్ష్మి (Baghya Laxmi) దంపతులు. వీరికో అయాన్ ఆశ్రిత్ (Ayan AAsrith) అనే కుమారుడు ఉన్నాడు. కుటుంబ పోషణ., కుమారుడి భవిషత్ కొరకు దుబాయ్ (Dubai) వెళ్లి సంపాదించాలని సంకల్పించారు. కుటుంబ పోషణకు వేరే మార్గం తప్పలేదు.. దీంతో  కుమారుడిని విడిచి వెళ్లాల్సిన పరిస్థితి. దీంతో వేరే మార్గం లేకుండా నాన్నమ్మ దగ్గర అయాన్ ఆశ్రిత్ ను ఉంచి.. దుబాయ్ వెళ్లారు.

  శివకుమార్ కు ఇంద్రజ అనే చెల్లెలు ఉండేది. ప్రేమ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంది. మాచునూరు అంజాన్ కుమార్ తో కొన్నేళ్లు ప్రేమాయణం అనంతరం అతనినే పెళ్లి చేసుకుంటానని శివకుమార్ కి చెప్పింది. దీనికి శివ కుమార్ అంగీకరించలేదు. ఇంద్రజను దూషించి.. ఎవరినైనాచేసుకో.. మా ఇంటి మెట్లు మాత్రంలెక్కకు అంటూ హుకుం జారీ చేసాడు శివకుమార్. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా ఇంద్రజ కోపంతో రగిలిపోయిన ఆమె.. పగ పెంచుకుంది.

  ఇదీ చదవండి : అమ్మవారికి శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ.. ఘనంగా అనంత పద్మనాభ వ్రతం

   దీంతో అన్న దుబాయ్ వెళ్లిన వెంటనే అన్న కుమారుడు అయాన్ ఆశ్రిత్ పై పాగా సాదించాలని స్కెచ్ వేసింది.  పక్క ప్లాన్ ప్రకారం నానమ్మ దగ్గర ఉన్న శివ కుమార్ కుమారుడు అయాన్ ఆశ్రిత్ కుమార్ కు మాయ మాటలు చెప్పి బాగా చూసుకుంటాం చదివిస్తామని ఇంటికి తీసుకెళ్లారు. కానీ అలా వెళ్లిన అయాన్ ఆశ్రిత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.

  ఇదీ చదవండి : ఈ సమయంలో తప్పక చూడాల్సిన బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇదే..? ఎలా వెళ్లాలి.. ప్రత్యేకత ఏంటి?

  కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదైందని తెలిసిన వెంటనే..  అత్త ఇంద్రజ, మామ అంజాన్ కుమార్ లు పరారయ్యారు. పోలీసు బృందాలు తమను గుర్తించే అవకాశం ఉందని భయపడి.. గుర్తించి కడప డిప్యూటీ తహసీల్దార్ ఎదుట నిందితులు అంజన్ కుమార్, ఇంద్రజలు లొంగిపోయారు. తండ్రి శివకుమార్ పై కక్షతో బాలుడిని చంపాలనే ఉద్దేశ్యంతో ఇంద్రజ, అంజన్ కుమార్ లు చిత్రహింసలకు గురి చేసారు. ఒంటిపై వేడి వేడి కడ్డీలతో కాల్చి, వాతలు పెట్టి కొట్టి చంపినట్లు నిందితులు అంగీకరించారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, Kadapa

  ఉత్తమ కథలు