D Prasad, News18, Kadapa
Crime News: కన్నబిడ్డను ఎవరైనా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఎంత శ్రమ పడినా.. బిడ్లలను సంతోషంగా చూడాలి అనుకుంటారు. వారి కోసం ప్రాణాలకు కూడా తెగిస్తారు.. ఏం చేసైనా పిల్లకు ఎలాంటి ప్రమాదం లేకుండా కాపాడుకుంటారు. కానీ గణతంత్ర దినోత్సవం (Republec Day) నాడు ఘోరం జరిగింది. తొమ్మిది నెలలు కష్టాలకు ఓర్చి.. పేగు బంధం తెంచుకుపుట్టిన కంటి పాపను పొట్టను పెట్టుకుంది. తన కూతురు గొంతు కోసింది తల్లి. ఇలాంటి సంఘటనలు సమాజంలో విపరీతంగా పెరుగుతున్నాయి. మనుషుల మద్య అనుబంధాలు తరిగిపోతున్నాయి. పండగ రోజే కన్న కూతురు, కొడుకుపై దాడి చేసి హతమార్చిన నక్కల దిన్నె సంఘటన మరవక ముందే అలాంటి మరొక సంఘటన వెలుగులోనికి వచ్చింది.
గణతంత్ర దినోత్సవం నాడు సొంత కూతురిపై ఒక తల్లి విచక్షణ రహితంగా దాడి చేసి చంపిన ఘటన జిల్లాలో వెలుగు చూపింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం కొత్తపేట గ్రామంలో పొద్దున్నే నిద్ర మంచం లేవక ముందే విషాదం చోటు చేసుకుంది.
నిద్రలో ఉన్న సొంత కూతూరుపై ఒక తల్లి అతి ఘోరంగా కత్తితో దాడి చేసి గొంతు కోసి చంపింది. వివరాలలోకి వెళితే కొత్తపేట గ్రామంలో నివసించే రాధా,సుబ్బరాయుడు . దంపతులు తొమ్మిది సంవత్సరాల కూతురుతో జీవనం కొనసాగించేవారు. కొద్ది రోజుల క్రితం రాధ మానసిక పరిస్థితి బాగోలేక ఇంటి నుండి బయటకి వెళ్లి పోయి కొద్ది రోజుల క్రితమే మరలా ఇంటికి తిరిగి వచ్చిందని. అలా వచ్చిన కొద్ది రోజులకే ఘోరం జరిగిందని స్థానికులు చెపుతున్నారు.
ఇదీ చదవండి : ఘనంగా రిపబ్లిక్ డే ఉత్సవాలు.. వారందరికీ సత్కారం..
ఈ సంఘటనతో ఉలిక్కిపడిన గ్రామ ప్రజలు రక్తపు మడుగులో వున్న బాలికను చూసి పోలీసులకి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారించగా తన భార్యకు మానసిక ఆరోగ్యం సరి లేదని ఆ కారణం తోనే ఇలా చేసి ఉంటుందని రాధ భర్త పోలీసులకి వివరించాడు.
ఇదీ చదవండి : రేపటి నుంచి యువగళం.. తిరుమల క్యూ లైన్ లో లోకేష్ ను వెయిట్ చేయించారా..?
ఆరోగ్యం నిమిత్తం రాధాని కడప రిమ్స్ ఆసుపత్రికి పంపించారని సమాచారం. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సెలవు రోజు ఇలాంటి ఘటన జరగడంతో స్థానికులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విచారిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Kadapa, Local News