హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

CM jagan: సొంత జిల్లాలకు సీఎం జగన్.. ఎందుకంటే.. పూర్తి షెడ్యూల్ ఇదే

CM jagan: సొంత జిల్లాలకు సీఎం జగన్.. ఎందుకంటే.. పూర్తి షెడ్యూల్ ఇదే

సీఎం జగన్ (File Photo)

సీఎం జగన్ (File Photo)

CM jagan Kadap tour: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి.. సొంత జిల్లా బాట పడుతున్నారు. రెండు రోజుల పాటు అక్కడే ఉండనున్న ఆయన.. పలు పనులకు ప్రారంభోత్సవాలు చేస్తారు.. సీఎం పూర్తి షెడ్యూల్ ఇదే..

  • News18 Telugu
  • Last Updated :
  • Kadapa (Cuddapah), India

CM Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Jagan Mohan Reddy) ఎన్నికల మూడ్ లో ఉన్నారు. అందుకే ఇప్పుడు జనం బాట పడుతున్నారు. వరుసగా పర్యటలను చేపడుతున్నారు. ఇప్పుడు సొంత జిల్లా కడప (Kadapa) పై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా కడప జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. కలెక్టర్‌ విజయరామరాజు (Vijayaramarao) పర్యటన వివరాలు వెల్లడించారు. డిసెంబరు 2, 3 తేదీల్లో జిల్లాలో జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని తెలిపారు. డిసెంబర్‌ 2న ఉదయం సీఎం జగన్‌ తన నివాసం నుంచి బయల్దేరి 10.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు (Gannavaram Airport) కు చేరుకుంటారు. అక్కడి నుంచి 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. 11.15 నుంచి స్థానిక నేతలతో మాట్లాడిన అనంతరం.. 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50 గంటలకు లింగాల మండలంలోని సీబీఆర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకుంటారు.

మధ్యాహ్నం 12.00 గంటలకు అక్కడ బోటింగ్‌ జెట్టిని స్టార్ట్ చేస్తారు. 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్‌ వైఎస్సార్‌ లేక్‌ వ్యూ పాయింట్‌కు వెళ్తారు. 12.40 గంటలకు అక్కడికి చేరుకుని వైఎస్సార్‌ లేక్‌ వ్యూ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తారు. 1.00 నుంచి 1.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు.

తరువాత 1.30 నుంచి 4.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఆ తరువాత 4.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5.00 గంటలకు హెలికాఫ్టర్‌లో ఇడుపులపాయ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 5.00 నుంచి 5.10 గంటల వరకు స్థానిక నేతలతో మాట్లాడి, 5.20 కు ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

ఇదీ చదవండి : ఆ విషయాలు చెపితే ఉరి వేసుకోవాల్సిందే..? చంద్రబాబుపై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

డిసెంబర్‌ 3వ తేదీ ఉదయం 8.30 గంటలకు వైఎస్సార్‌ ఎస్టేట్‌ నుంచి బయలుదేరి 8.35 గంటలకు అక్కడ ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 8.40 గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి 8.55 గంటలకు పులివెందుల భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9.00 గంటలకు రోడ్డు మార్గాన ఎస్‌సీఎస్‌ఆర్‌ గార్డెన్స్‌కు వెళ్తారు.

ఇదీ చదవండి : అలీ పరిస్థితి చూసి చలించిపోయిన సీఎం జగన్ .. ఏం చేశారంటే..?

రాత్రి కూడా బిజీగానే గడపనున్నారు. 9.15 నుంచి 9.30 గంటల వరకు సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి.రవిశేఖర్‌ కుమార్తె వివాహ వేడుకలకు హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన తరువాత.. 9.35 గంటలకు అక్కడి నుంచి భాకరాపురంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9.45 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరతారు. 10.10 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10.15 గంటలకు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని 11.30 గంటలకు తన నివాసానికి చేరుకుంటారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Kadapa

ఉత్తమ కథలు