రిపోర్టర్ : ప్రసాద్
లొకేషన్ : కడప
మనసుకు నచ్చిన పనిని చేస్తూ ఆ పనిలో ఆనందాన్ని వెతుక్కుంటూ, విజయవంతంగా ముందుకు సాగుతున్న ఒక రైతు గాధ ఇది. తనకు ఇష్టమైన వ్యవసాయాన్ని వదులుకోలేదు. అయితే పాడి పశువుల పైన ఉన్న మక్కువతో నాలుగు సంవత్సరాల కిందట ఒక డైరి ఫారం ఏర్పాటు చేశాడు.
నేడు ఈ పాల ఉత్పత్తి కేంద్రాన్ని విజయవంతంగా నిర్వహిస్తూలాభసాటిగా ముందుకు సాగుతూ ఈ రంగంలోని రైతులకి ఆదర్శంగా నిలుస్తున్నారు. కడప నగరం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో, రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళే మార్గంలో ఒక డైరి ఫారం ఆ దారిలో వెళ్లేవారి దృష్టిని ఆకర్షిస్తుంది.
దేశవాళి ఆవులు మరియు గేదెలతో ఆ డైరి ఫారంని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ రైతు శివరామిరెడ్డి. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన ఏమంటారంటే “మనసుకు నచ్చిన పని చేసుకుంటూ నచ్చిన విధంగా బ్రతకడం అనేది గొప్ప అదృష్టం” అని అంటారు. నాలుగు సంవత్సరాల క్రితం మొదలైన ఈయన పాల వ్యాపారం విజయవంతంగా కొనసాగుతుంది. ఏదేమైనా దృఢ సంకల్పం ఉంటే మనం చేపట్టే ఏ పనినైనా సమర్థవంతంగా చేయగలం, అనుకున్నది సాధించగలం అంటున్నారు రైతు శివరామిరెడ్డి. ఆయన మాటల్లో ఆయన విజయ పరంపరని తెలుసుకుందాం..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kadapa, Local News