హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మహామహులకి పుట్టినిల్లు.. పులివెందుల పూలంగల్లకు వందేళ్ల చరిత్ర..

మహామహులకి పుట్టినిల్లు.. పులివెందుల పూలంగల్లకు వందేళ్ల చరిత్ర..

X
వందేళ్ల

వందేళ్ల చరిత్ర కల్గిన ప్రాంతం

Andhra Pradesh: పులివెందుల పూలంగల్లు, ఈ పేరు ఎక్కడో విన్నట్లుందా..? వినే ఉంటారు. ఎందుకంటే ఈ మద్య సినిమాల్లో బానే వినపడుతుంది ఈ పేరు. మరి ఈ పేరు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి ఉందా అయితే ఈ వీడియో చూడండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

పులివెందుల పూలంగల్లు, ఈ పేరు ఎక్కడో విన్నట్లుందా..? వినే ఉంటారు. ఎందుకంటే ఈ మద్య సినిమాల్లో బానే వినపడుతుంది ఈ పేరు. మరి ఈ పేరు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి ఉందా అయితే ఈ వీడియో చూడండి. మన కడప జిల్లలో పులివెందుల ప్రాంతం ఎంతో ప్రాముఖ్యత పొందింది. ఇక్కడినుండి మన రాష్ట్రానికి అసాదరణమైన దివంగత రాజకీయ నాయకులు వై ఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడి నుండి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు.

నేడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మన రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. అంతే కాకుండా అనేకమైన మహామహులకి ఈ పులివెందుల పుట్టినిల్లు అయింది. అటువంటి ఈ పులివెందులలో ఈ పూలంగల్లు ఒక ప్రధాన పోషిస్తుంది. పులివెందుల పూలంగళ్లఅంటే ఒక పేరు కాదు.అక్కడి ప్రజలతో ముడిపడి వున్న ఒక బంధం, పులివెందుల పట్టణానికి ఇదొక మూల స్థానం.నగరంలో ఈ పూలంగల్లు ప్రధాన కూడలి, నగరంలోనికి వచ్చే ఎంతోమంది కొత్తవాళ్లకి ఈ పూలంగల్లె మార్గదర్శం.

నగరంలో నుండి బయట ప్రాంతాలకి వెళ్ళాలంటే ఈ పూలంగళ్ల సర్కిల్ ని దాటి వెళ్ళాలి. ఒక్కమాటలో చెప్పాలంటే పులివెందుల నగరంలో పూలంగల్లకూడలిని కాదని ఏపని చేయలేనంతగా ముడిపడిఉంటుంది.ఈ పూలంగల్లకువందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉందంటే, ఆశ్చర్య పోవడం అతిశయోక్తి కాదు. కాని అది నిజం..ఈ పూలంగల్లు ప్రాంతానికి ఆ పేరు ఇప్పుడు వచ్చింది కాదు. సుమారు వందల సంవత్సరాల క్రితం నుండి కొనసాగుతూ వుంది.

నగరంలో ఎన్నో మార్పులు జరిగినా ఎక్కడి కూడలి మాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటికి మూడు తరాల పూల వ్యాపారులు ఇక్కడే పూలమ్ముతు వారి జీవనాన్ని కొనసాగిస్తూ వున్నారు. పూర్వం నుండి పులివెందుల పట్టణం వెలుపల వున్నా రంగనాథస్వామి వారి బ్రహ్మోత్సవ సేవల అలంకారానికి ఇక్కడి నుండే పువ్వులు వెళ్లేవని...ఇప్పటికి ఆ ఆచారం కొనసాగుతూ వుందని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ పూలంగల్లు పక్కనే స్వామి వారి రథంకూడా కొలువై వుంది. ఇప్పటికి ఇక్కడి నుంచి నగరంలో స్వామివారి బ్రహ్మోత్సవ సేవలు మొదలవుతాయి.

First published:

Tags: Andhra Pradesh, Kadapa, Local News

ఉత్తమ కథలు