దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మీద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సెటైర్లు వేశారు. రామ్ గోపాల్ వర్మ తీసిన సినిమా కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉందన్నారు. వర్మ తన పేరుని కూడా వాడుకోలేని పరిస్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. సెన్సార్ బోర్డు ఆదేశాలతో కొన్ని సీన్లు మార్చి సినిమా సెట్ చేశారన్నారు. వర్మ నోరు విప్పితే అబద్ధాలేనన్నారు. వర్మ తనను, దేవుడిని క్షమాపణ కోరితే మంచిదన్నారు. ఇప్పటికైనా దేవుడి దయ ఆయనపైనే ఉండి, మంచి సినిమాలు చేస్తే మంచిదన్నారు. ఇలాంటి పిచ్చి సినిమాలు చేయకపోతేనే మంచిదన్నారు. అమెరికాలో ఉన్న కేఏ పాల్ స్కైప్ ద్వారా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తాను ట్రంప్‌ను కలవడానికి అమెరికా వచ్చానని, నెల రోజులు అక్కడే ఉంటానని తెలిపారు. తనకు పబ్లిసిటీ అవసరం లేదని చెప్పారు. ప్రపంచ శాంతి కోసం తిరుగుతున్నానన్నారు. తాను ఎన్నికలను మార్చిలోనే బహిష్కరించానని చెప్పారు. అప్పులు చేస్తున్న రెండు రాష్ట్రాల సీఎంలు అభివృద్ధి చేయడం లేదని ఆరోపించారు. వారు కోరితే వేల కోట్లు లాభం వచ్చేలా చేస్తానని చెప్పారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.