హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tiger Scare: 18 రోజులైనా చిక్కని పులి.. తృటిలో తప్పించుకోవడంతో కలవరం.. దాడి చేస్తుందేమోనని భయం భయం

Tiger Scare: 18 రోజులైనా చిక్కని పులి.. తృటిలో తప్పించుకోవడంతో కలవరం.. దాడి చేస్తుందేమోనని భయం భయం

కాకినాడలో కెమెరాకు చిక్కిన పులి

కాకినాడలో కెమెరాకు చిక్కిన పులి

Tiger Scare:క్షణ క్షణం భయం భయం.. ఆ పరిశర ప్రాంత ప్రజలంతా కంటిపై కునుకు లేకుండా పోతోంది. ఏ క్షణం.. ఎటువైపు నుంచి పులి వస్తుందో తెలియక టెన్షన్ పడుతున్నారు. ఒకటి రెండు రోజుల కాదు అధికారులకు ఫిర్యాదు చేసి 18 రోజులైనా పులి జాడ చిక్కకపోవడంతో.. భయం భయం నెలకొంది.

ఇంకా చదవండి ...

Tiger Scare: కాకినాడ జిల్లా (Kakinada District)లో పులి (Tiger) కోసం సాగుతున్న వేట 18 రోజులు దాటింది. పులి మాత్రం బోనుకు చిక్కడం లేదు. కాకినాడ జిల్లా పత్తిపాడు పరిసరాల్లో ఆ పులి సంచిరిస్తున్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాలెంలో మూడు బోన్లు ఏర్పాటు చేసి, మాంసాన్ని ఎరగా వేశారు. అయినా ఎక్కడా పులి జాడ చిక్కడం లేదు. సరిగ్గా రెండు రోజుల క్రితం పులి ఒక బోను దగ్గరికి వచ్చి, చిక్కకుండానే వెనుదిరిగి వెళ్లిపోయినట్టు గుర్తించారు. దీంతో అయ్యో చిక్కినట్టే చిక్కి పోయిందే అని అధికారులు, గ్రామస్థులు టెన్షన్ పడుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరా (CC Cemara) లో రికార్డు అయ్యాయి. దీంతో పులిని పట్టుకోవడం ఎలా అని అధికారులు టెన్షన్ పడడం లేదు. ఎంతగా ప్రయత్నిస్తున్నా సాధ్యపడటం లేదని తలలు పట్టుకుంటున్నారు. నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) - శ్రీశైలం (Srisailam) టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తునే ఉన్నారు. మరోవైపు పులి చిక్కకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బయటకు వెళ్లేందుకు కూడా భయపడుతున్నారు. వ్యవసాయం, కూలి పనులకు వెళ్లే వాళ్లు ఆందోళనకు గురవుతున్నారు.

ఒకటి రెండు రోజలు కాదు.. పత్తిపాడు మండలంలో మూడు వారాలుగా పులి అటవీ శాఖ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. దానిని పట్టుకొనేందుకు ఎన్ని ఉపాయాలు పన్నినా చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటోంది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే అధికారులను టెన్షన్ పెట్టింది. పులిని పట్టుకొనేందుకు అటవీశాఖ సిబ్బంది ఎక్కడికక్కడ ప్రత్యేక బోన్లు ఏర్పాటు చేశారు. కానీ శనివారం అర్థరాత్రి తరువాత శరభవరం దగ్గర ఏర్పాటు చేసిన బోను దగ్గరకు పులి వచ్చింది. అలా వచ్చిన పులి ఎర కోసం బోనులోకి వెళ్తే చిక్కేది.. కానీ అనూహ్యంగా బోను ద్వారం వరకు వచ్చి వెనుదిరిగిపోయింది.  

ఇదీ చదవండి : మహిళను స్తాంభానికికట్టేసి.. కొట్టిన గ్రామస్తులు.. ఎందుకు అలా చేశారో తెలుసా..?

దానికి సంచరించిన దృశ్యాలు మరోసారి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. పులిని పట్టుకొనేందుకు పొదురుపాక, శరభవరం, ఒమ్మంగిలో మూడు బోన్లు ఏర్పాటు చేసి పశు మాంసం ఎరగా వేశారు. ఆ మాంసానికి ఆశ పడి పులి వస్తే బోనులో చిక్కుతుందని అధికారులు అంచనా వేస్తారు.

ఇదీ చదవండి : పిట్టకొంచెం కూత ఘనం అంటే ఇదే.. ఆమె సక్సెస్.. ఆ పథకానికే పేరు తెచ్చింది.

ఈ ప్రాంతాల్లో ఆహారం, వసతి సౌకర్యంగా ఉండటంతో పులి ఇక్కడే ఉండి వేటాడుతున్నట్లు అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు పులి జాడలు సీసీ కెమెరాళ్లలో రికార్డు అవుతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ సమయంలో మనుషులపై దాడి చేస్తుందోనన్న భయంతో బయటకు వచ్చేందుకు కూడా స్థానికులు సాహసించడం లేదు. అయితే పులిని సాధ్యమైనంత త్వరగా పట్టుకోవాలని అటవీశాఖ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Kakinada, Tiger, Tiger Attack

ఉత్తమ కథలు