నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) గుండెపోటుకు గురయ్యారు. దీనితో ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ కార్యకర్తలు, నందమూరి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. విషయం తెలుసుకున్న బాలయ్య ఆసుపత్రికి చేరుకొని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో తారకరత్న సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణకు ఫోన్ చేసినట్లు తెలుస్తుంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై బాలయ్యను ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు వైద్యం చేస్తున్నారు. ప్రాణాపాయం ఏమి లేదని బాలయ్య ఎన్టీఆర్ కు చెప్పినట్లు తెలుస్తుంది.
ఇక నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్య పరిస్థితిపై బాలకృష్ణ మీడియాకు అప్డేట్ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. గుండె ఎడమవైపు 90 శాతం బ్లాక్స్ ఉన్నాయి. ఇక బీపీ మాత్రం నార్మల్ గా ఉంది. మిగతా రిపోర్టులన్నీ నార్మల్ గా ఉన్నాయన్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని బాలయ్య (Balakrishna) మీడియాకు వివరించారు. చంద్రబాబు ప్రతీ 10 నిముషాలకు ఒకసారి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారన్నారు.
వైద్యులు ఏమన్నారంటే?
ప్రస్తుతం తారకరత్న (Nandamuri Tarakaratna) ఆరోగ్యం క్రిటికల్ గానే ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన గుండెకు రేండు వైపులా కూడా బ్లాక్స్ ఉన్నాయని వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు సీపీఆర్, యాంజియోగ్రామ్ చేశారు. గుండెకు రెండు కంటే ఎక్కువ బ్లాక్స్ ఉండడంతో ఆయన ఆరోగ్యం కుదుటపడడం లేదని తెలుస్తుంది. ఆయనను ఆసుపత్రికి తరలించే సమయంలో స్పృహతో లేరు. అలాగే శరీరం కూడా బ్లూగా మారింది. పల్స్ కూడా లేదని డాక్టర్లు చెప్పారు. ఆసుపత్రికి వచ్చాక చికిత్చ అనంతరం 45 నిమిషాలకు తారకరత్న పల్స్ పని చేయడం మొదలు పెట్టింది. మా ప్రయత్నం మేము చేస్తున్నామని డాక్టర్లు చెప్పుకొచ్చారు.
కుప్పం టు బెంగళూరు..రోడ్డు మార్గంలోనే..
కాగా నందమూరి తారకరత్నకు మెరుగైన చికిత్స కోసం బెంగళూరుకు తరలించనున్నారు. అయితే ఎయిర్ లిఫ్ట్ కు అవకాశం లేకపోయింది. ఎందుకంటే హెలికాఫ్టర్ లో బెంగళూరు తీసుకెళ్లాలంటే ఎమర్జెన్సీ పరికరాలతో కూడి వుండాలి. కానీ అలాంటి హెలికాఫ్టర్ అందుబాటులో లేదు. దీనితో అంబులెన్స్ లోనే గ్రీన్ ఛానల్ ద్వారా తారకరత్న (Nandamuri Tarakaratna) ను బెంగళూరులోని మనిపాల్ ఆసుపత్రికి తరలించనున్నట్టు తెలుస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Nandamuri balakrishna, NTR