తెలుగు దేశం పార్టీని స్థాపించి.. ఢిల్లీ స్థాయిలో తెలుగు వారి సత్తా చూపించిన మాజీ సీఎం ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా.. ఆయన కుటుంబ సభ్యులు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణరామ్ తదితరులు.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించారు. తెలుగు వారి కోసం ఎన్టీఆర్ చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. సీఎం ఎన్టీఆర్ అని నినాదాలు చేశారు. ఇది ఎన్టీఆర్‌కి ఒకింత ఇబ్బంది కలిగించింది.
ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి... నివాళులు అర్పించనున్నారు. ఈ కార్యక్రమాల్లో కార్యకర్తు, అభిమానులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని టీడీపీ నేతలు కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad news, Telangana News