అధిగ ఉష్ణోగ్రతల ఎఫెక్ట్... పాఠశాలలకు 3 రోజుల సెలవు

ప్రైవేటు స్కూళ్లకు కూడా సెలవు ఇవ్వాల్సిందేనని మంత్రి గంటా స్పష్టంచేశారు.

news18-telugu
Updated: June 18, 2018, 10:31 PM IST
అధిగ ఉష్ణోగ్రతల ఎఫెక్ట్... పాఠశాలలకు 3 రోజుల సెలవు
పాఠశాల విద్యార్థులు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయన్న వాతవరణ శాఖ సూచనల నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి స్పష్టంచేశారు.

మంగళవారం(19 తేదీ) నుంచి ఈ నెల 21 వరకు సెలవులు ఉంటాయని తెలిపారు. మళ్లీ ఈ నెల 22న పాఠశాలలు యథావిథిగా ప్రారంభం కానున్నట్టు తెలిపారు. ప్రైవేటు స్కూళ్లకు కూడా తప్పనిసరిగా మూడు రోజులు సెలవులు ఇవ్వాలని ఆదేశించారు. ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరైనా క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు.
First published: June 18, 2018, 10:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading