హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jr NTR: సీఎం అవ్వాలన్న ఆశ.. ఆకాంక్ష రెండూ ఉన్నాయి.. టీడీపీతోనే అనుబంధం.. ఆయన మనసులో మాట ఇదే

Jr NTR: సీఎం అవ్వాలన్న ఆశ.. ఆకాంక్ష రెండూ ఉన్నాయి.. టీడీపీతోనే అనుబంధం.. ఆయన మనసులో మాట ఇదే

చంద్రబాబు, ఎన్టీఆర్ (ఫైల్)

చంద్రబాబు, ఎన్టీఆర్ (ఫైల్)

Jr NTR: ఆయన కనపడితే చాలా సీఎం సీఎం అనే నినాదమే వినిపిస్తోంది.. ఆయన లేనప్పుడు కూడా ఫోటోలు.. జెండాలు పట్టుకుని సీఎం సీఎం అని అరుస్తున్నారు. అది కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ హంగామా చేస్తున్నారు. ఎందుకిలా.? ఇది అభిమానుల మనసులో మాట..? లేక ఎవరైనా చేయిస్తున్నారా...? అసలు ఎన్టీఆర్ మనసులో ఏముంది..?

ఇంకా చదవండి ...

Jr NTR Fans in kuppam:  ప్రస్తుతం టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు హాట్ టాపిక్ అవుతోంది. ఆయన అభిమానులు కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు.  అది కూడా టీడీపీ  అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కు కంచుకోటగా చెప్పుకునే కుప్పం (Kuppam)లో పరిస్థితులు మారిపోతున్నాయి.  మఖ్యంగా  టీడీపీ (TDP) కార్యకర్తలే అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడం..  కలవరపాటుకు గురి చేస్తోంది. తాజాగా కుప్పంలో జూ.ఎన్టీఆర్ (Jr NTR) అభిమానులు ధర్నా చేయడం చర్చకు దారి తీస్తోంది. అయితే వారంతా టీడీపీ అభిమానులే కావడంతో కుప్పంలో పరిస్థితి ఏంటి అన్నది గందరగోళంగా ఉంది.

ఇటీవల ఏపీ అసెంబ్లీ (AP Assembly)లో వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి (Nara Bhuvaneswari)పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నందమూరి ఫ్యామిలీతో పాటు జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ వంటి హీరోలు అంతా తీవ్రంగా స్పందించారు. జూ.ఎన్టీఆర్ సైతం వీడియో ద్వారా అసెంబ్లీలో జరిగిన ఘటనను సున్నితంగా ఖండించారు. కానీ దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు  చేశారు.

ఇదీ చదవండి : నేనే ప్రత్యక్ష సాక్షిని.. ఆ రోజు అసెంబ్లీలో ఏం జరిగిందంటే..? క్లారిటీ ఇచ్చిన స్పీకర్

ఎన్టీఆర్ ఆది, సింహాద్రిలా రెచ్చిపోతారని ఆశిస్తే.. చాగంటి ప్రవచనాలు చెప్పారంటూ టీడీపీ నేతలు తీవ్ర విమర్శుల చేశారు. అయితే దానికి ఎన్టీఆర్ అభిమానులు కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ కు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి అంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : పీఆర్సీపై మంత్రి క్లారిటీ.. ఉద్యోగ సంఘాలకు నాది భరోసా అంటున్న బొత్స

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తీరుపై టీడీపీ అధిష్టానం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. నిజంగా జూనియర్ అభిమానులే  ఇదంతా చేస్తున్నారా..? లేక వెనుక ఉండి ఎవరైనా ఇదంతా చేయిస్తున్నారు. టీడీపీ అభిమానులై ఉండి ఎందుకు ఇలా ఆందోళనలు చేస్తున్నారని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి : మొన్నటి వరకు ఢీ అంటే ఢీ అన్నారు.. తిట్టుకున్నారు.. తొడలుకొట్టుకున్నారు.. ఇప్పుడు చేయి చేయి కలిపారు

ఎవరి విమర్శలు ఎలా ఉన్నా.. అసలు జూనియర్ ఎన్టీఆర్ మనసులో ఏముంది అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై జూనియర్‌ ఎన్టీఆర్‌ సంఘం అధ్యక్షుడు శివ పీసీ స్పందించారు.  జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని ఆయన క్లారిటీ ఇచ్చారు. తామంతా టీడీపీకే పనిచేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. తమకు జూనియర్ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశంతోనే జీవితాంతం ఉంటానని చెప్పారు అంటూ కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు క్లారిటీ ఇచ్చారు.

ఇదీ చదవండి : ఏపీ సీఎం జగన్ కంటే ఉత్తర కొరియా కిమ్ నయం..? ఎందుకంటే..? లోకేష్ కామెంట్

జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే తాము సీఎం ఎన్టీఆర్ అనే నినాదాలు చేస్తున్నామంటున్నారు.  కానీ టీడీపీ వ్యతిరేకంగా తాము ఏమీ మాట్లాడడం లేదని స్పష్టం చేశారు.  రాష్ట్రం లోని ఎన్టీఆర్ అభిమానులకు సైతం జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలన్న ఆశ, ఆకాంక్ష వుందన్నారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఎప్పుడు తన మనసులో మాట బయట పెట్టలేదన్నారు.

ఇదీ చదవండి : టీడీపీ నేతలకు వార్నింగా..? వైసీపీ మైండ్ గేమా..? కుప్పంలో ఎన్టీఆర్ అభిమానుల స్ట్రాటజీ అదే..?

అయితే  కొంతమంది దీన్ని రాజకీయం చేస్తున్నారని తారక్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, నారా రెండు ఫ్యామిలీలు ఒక్కటిగానే ఉన్నప్పుడు వారి మధ్య విబేధాలు సృష్టించాలని పని గట్టుకుని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు.

First published: