హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jr NTR - Kalyan Ram : చంద్రబాబు ఉదంతంలో వైసీపీ నేతలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్ట్రాంగ్ కౌంటర్..

Jr NTR - Kalyan Ram : చంద్రబాబు ఉదంతంలో వైసీపీ నేతలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ స్ట్రాంగ్ కౌంటర్..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా పుణ్యమా అని నాలుగేళ్లుగా ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు తారక్. తన కెరీర్లో ఇంత భారీ బ్రేక్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు జూనియర్. దాంతో రాబోయే రెండు మూడు రోజులు వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాడు యంగ్ టైగర్. దానికి తగ్గట్టుగానే కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. త్రిబుల్ ఆర్ సినిమా పుణ్యమా అని నాలుగేళ్లుగా ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు తారక్. తన కెరీర్లో ఇంత భారీ బ్రేక్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు జూనియర్. దాంతో రాబోయే రెండు మూడు రోజులు వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాడు యంగ్ టైగర్. దానికి తగ్గట్టుగానే కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

Jr NTR - Kalyan Ram : చంద్రబాబు ఉదంతంలో వైసీపీ నేతలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా వేదికగా  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

  Jr NTR - Kalyan Ram : చంద్రబాబు ఉదంతంలో వైసీపీ నేతలకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్,  నారా రోహిత్ సోషల్ మీడియా వేదికగా  స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ శుక్రవారం ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి, అంబటి రాంబాబు.. టీడీపీ వ్యవస్థాపకుల ఎన్టీఆర్ కూతురు,  తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై పరుష పదజాలంతో దూషించిన రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఐతే.. భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు ఒకప్పుడు టీడీపీతోనే రాజకీయ  ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. వీళ్లిద్దరు జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తులు. అలాంటి వ్యక్తులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది.

  ఈ ఘటనపై నందమూరి ఫ్యామిలీ పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోన్న బాలకృష్ణ .. తన సోదరి మణులు, సోదరులతో కలిసి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించిన సంగతి తెలిసిందే కదా. అంతేకాదు వైసీపీ నేతలు ఏ విషయాన్నైనా అంశాల వారీగా ఖండించాలి కానీ.. ఇలా వ్యక్తిగతంగా ఒక మహిళ వ్యక్తిత్వాన్ని కించ పరిచే విధంగా మాట్లాడం తగదంటూ వైసీపీ నేతలకు కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇచ్చారు.

  తాజాగా నారా భువనేశ్వరిపై వైసీపీ నేతలకు చేసిన వ్యాఖ్యలను ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్ రామ్ ఖండించారు. ఈ సందర్బంగా తారక్ మాట్లాడుతూ.. దూషణకు గురైన బాధితురాలి కుటుంబీకుడిగా కాకుండా, ఒక వ్యక్తిగానే తానీ మాటలు చెబుతున్నానంటూ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జూనియర్.

  Silver Screen Police: సిల్వర్ స్క్రీన్ పై ఖాకీ పవర్ చూపించిన తెలుగు హీరోలు.. Part - 1

  టీడీపీకి సారధ్యం వహించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు, అభిమానులు తరచూ ఆందోళనలకు దిగుతోన్న దరిమిలా నారా భువనేశ్వరి ఉదంతంలో జూనియర్ ఎన్టీఆర్ ఆచితూచి స్పందించారు. ఇది మంచి సంప్రదాయం కాదు. ఇలాంటి దుష్ట సంప్రదాయలకు మనం ఇకనైనా ముగింపు పలకాలన్నారు.  అదే సమయంలో తన ఆప్తులు వంశీ, నాని పేర్లను కూడా ఆయన ప్రస్తావించ పోవడం గమనార్హం.

  మరోవైపు కళ్యాణ్ రామ్ కూడా ఈ ఘటనపై విచారం  వ్యక్తం చేశారు. అసెంబ్లీ అనేది ప్రజా సమస్యలను ప్రస్తావించి వాటిని పరిష్కరించే దేవాలయం వంటిది. అక్కడ చాలా మంది మేధావులున్నారు. అలాంటి గొప్ప ప్రదేశంలో రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి గురించి మాట్లాడటం బాధాకరమన్నారు. మహిళలను గౌరవించే మన సంప్రదాయంలో సాటి మహిళను అకారణంగా దూషించే పరిస్థితి ఎదురు కావడం దురదుష్టకరమన్నారు. ఈ సందర్భంగా అందరు హుందాగా నడుచుకోవాలన్నారు. అలాగే పూజ్యులు తాతగారు ఎన్టీఆర్ మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుందామన్నారు.

  మరోవైపు ఈ ఘటనపై నారా రోహిత్ కూడా స్పందించారు. తన పెద్దమ్మ భువనేశ్వరి ప చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. కొంత మంది రాజ్యాంగం ఇచ్చిన వాక్ స్వాతంత్య్రాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు.

  NTR Jr - Mahesh Babu : ఎన్టీఆర్, మహేష్ బాబు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకు టైమ్ ఫిక్స్.. అధికారిక ప్రకటన..


  ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీలో కొందరు సభ్యులు పశువుల కంటే హీనంగా సుధీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడుగారిని, ఆయన సతీమణిని అసభ్య పదజాలంతో దూషించడం దురదృష్టకరమన్నారు. రాజకీయ విమర్శలనేవి విధానాలపై ఉండాలే కానీ.. వ్యక్తిగతంగా అభం శుభం తెలియని  కుటుంబ సభ్యులను ఇందులో లాగడం ఎంత మాత్రం క్షమార్హం కాదన్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Chandrababu Naidu, Jr ntr, Kalyan Ram Nandamuri, Nara Bhuvaneshwari

  ఉత్తమ కథలు