Home /News /andhra-pradesh /

JR NTR GAVE LINE TO EX MINISTER KODALI NANI ON NTR HEALTH UNIVERSITY NAME CHANGE ISSUE NGS

Jr NTR-kodali Nani: కొడాలి నానికి లైన్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్.. మరి మాజీ మంత్రి స్పందిస్తారా..?

జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని (file)

జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని (file)

Jr NTR-kodali Nani: మాజీ మంత్రి కొడాలి నానికి- జూనియర్ ఎన్టీఆర్ కు మధ్య సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం కొడాలి నాని.. వైసీపీలో ఉన్నా.. ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఆప్తుడు.. సీనియర్ ఎన్టీఆర్ కు ఓ రకంగా భక్తుడే అని చెప్పాలి.. అదే స్థాయిలో వైఎస్ ను కూడా అభిమానిస్తారు. అలాంటి నాని తీవ్ర ఒత్తిడిలో ఉన్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఓ హింట్ ఇచ్చారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India
  Jr NTR-kodali Nani: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో (Andhra Pradesh Politics) కొడాలి నాని (Kodali Nani) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదటిలో కేవలం జూనియర్ ఎన్టీఆర్ స్నేహితుడిగానే రాజకీయాలకు వచ్చినా.. తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసకున్నారు. గుడివాడను అడ్డాగా మార్చుకున్నారు. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) నేతలను, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh) లను తిడుతూ మరింత క్రేజ్ పెంచుకున్నారు. ఓ వర్గానికి తనను హీరోగా మార్చుకున్నారు. అయితే అదే స్థాయిలో ఆయన తిట్లపై విమర్శలు ఉన్నప్పటికీ.. వైసీపీ (YCP)లో తిరుగులేని నాయకుడు అయ్యాడు అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహకం అవసరం లేదు. ప్రస్తుతం వైసీపీ నేతల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)కి అత్యంత అప్తులు అని చెప్పుకునే వారిలో కొడాలి నాని ఒకరు కచ్చితంగా ఉంటారు. ఆ విషయాన్ని జగనే ఒకటి రెండు సార్లు బహిరంగంగానే ప్రకటించారు. వైసీపీలో ఆయనకు అత్యంత గుర్తింపు ఉన్నా ఇటీవల షాక్ లపై షాక్ లు తగులుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే..? మొన్నటికి మొన్న మంత్రి పదవి పోయింది. అయినా దాన్ని ఆయన చాలా హుందాగానే తీసుకున్నారు.. జగన్ కు అత్యంత నమ్మకస్తుడ్ని కాబట్టే తనను తప్పించారంటూ కామెంట్స్ చేశారు. జగన్ నిర్ణయాన్ని కొడాలి సమర్దించుకున్నా.. ఆయన సామాజిక వర్గం నుంచి ఒక్కరికి కూడా ఎలాంటి పదవి లేకపోవడంతో.. సొంత సామాజిక వర్గంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఉంది. ఇటీవల జిల్లాల పేర్ల విషయంలో ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టించి.. కొంతవరకు డ్యామేజ్ కంట్రోల్ అయింతే చేయించుకున్నారు. కానీ ఇంతలోనే మరో షాక్ తగిలింది. తాజాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చి సీఎం జగన్ ఊహించని షాక్ ఇచ్చారు. దీంతో దీనిపై ఎలా స్పందిచాలో తెలియక కొడాలి నాని సైలెంట్ అయ్యారు. అయితే ఇటు టీడీపీ నేతలు, బీజేపీ నేతలు.. నందమూరి అభిమానులు సైతం కొడాలి నాని టార్గెట్ చేశారు. ఎన్టీఆర్ కుటుంబానికి అభిమానిని అని చెప్పుకునే నాని.. ఎన్టీఆర్ పేరు మార్పు చేసినప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. నిన్నటి నుంచి అంతా కొడాలి నాని స్పందన కోసమే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ విషయం ఎలా స్పందించాలో తెలియక ఆయన మీడియా ముందుకు రావడం లేదని సమాచారం.. ఇదీ చదవండి : ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై తారక్ సంచలన ట్వీట్.. ఏమన్నారంటే? అలా ఇబ్బంది పడుతున్న కొడాలి నానికి జూనియర్ ఎన్టీఆర్ ఓ హింట్ ఇచ్చినట్టే అయ్యింది. ఎందుకంటే ఎన్టీఆర్ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ తీవ్రంగా విరుచుకుపడతారని.. సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాన్ని తప్పు పడతారని అంతా ఆశించారు. కానీ ఆయన ఎప్పటిలానే వేదాంత దోరణిలో మాట్లాడారు. పేరు మార్చినంత మాత్రాన.. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించడం అవ్వదని.. ఆయన కీర్తి ప్రతిష్టలను ఎవరూ చెరిపేయలేరు అంటూ.. ట్వీట్ తో సరిపెట్టు.. టీడీపీ నేతలను నిరాశపరిచారు.. సీనియర్ ఎన్టీఆర్ మనవువు.. నందమూరి కుటుంబానికి భవిష్యత్తు వారసుడిగా చెప్పుకునే జూనియర్ ఎన్టీఆర్.. సీఎం జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టకుండా.. వైఎస్ఆర్ ను స్థాయిని పెంచేలా ట్వీట్ చేశారు. దీంతో ఇప్పుడు అదే స్టైల్లో కొడాలి నాని కూడా స్పందించడానికి ఓ లైన్ దొరికింది.. జూనియర్ మాటలనే.. కొడాలి నాని చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏది ఏమైనా కొడాలని నాని స్పందించడానికి ఓ ఐడియా ఇచ్చినట్టు అయ్యింది జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Jr ntr, Kodali Nani

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు