హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Jr NTR Fans: చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్.. జూనియర్ ఎన్టీఆర్ తప్పేంటి అని ఫ్యాన్స్ ఫైర్

Jr NTR Fans: చంద్రబాబు క్షమాపణలు చెప్పాలంటూ ట్విట్టర్ లో ట్రెండింగ్.. జూనియర్ ఎన్టీఆర్ తప్పేంటి అని ఫ్యాన్స్ ఫైర్

ట్విట్టర్ లో ట్రెండింగ్

ట్విట్టర్ లో ట్రెండింగ్

Jr NTR Fans fire: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందే.. ప్రస్తుతం ఈ అంశం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా మారింది. అయితే ఆయన క్షమాపణలు చెప్పాల్సింది దశాబ్దకాలం రాజకీయ శత్రువు సీఎం జగన్ కు కాదు.. మరి ఎవరికి అనుకుంటున్నారా..? ఎందుకు ఇంతలా ట్రెండ్ అవుతోంది ఆ అంశం..

ఇంకా చదవండి ...

Jr NTR Fire on  TDP :  చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాలా..? అసలు ఎందుకు ఎవరు.. ప్రస్తుతం ఈ అంశం ట్విట్టర్ లో ట్రెండింగ్ అవుతోంది. చంద్రబాబు వెంటనే తమ అభిమాన నటుడికి క్షమాపణలు చెప్పాలి అంటే ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇంతకి ఎందుకో తులుసా..?  ప్రస్తుతం   ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో  జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  హాట్ టాపిక్ గా మారారు. టీడీపీ నేతలే ఇలాంటి అనుమానాలను తెరపైకి తెస్తున్నారు.  ఇటీవల ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు (Nara Chandrababu naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara bhuvaneswari)పై అనుచిత వ్యాఖ్యలు చేశారు అంటూ చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు. దీంతో చంద్రబాబు నాయుడు.. ఆయన కుటుంబానికి భారీగా మద్దతు లభించింది. సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంతా చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. సోనూ సూద్, రజనీకాంత్ లాంటి వారు సైతం చంద్రబాబును పరామర్శించారు.  ఈ ఘటనపై నందరమూరి ఫ్యామిలీ అంతా భువనేశ్వరికి అండగా నిలిచింది. మరోవైపూ జూనియర్ ఎన్టీఆర్ సైతం స్పందించారు. అయితే ఆయన మాట్లాడుతూ.. తాను నందమూరి కుటుంబ సభ్యుడిగా మాట్లాడడం లేదని.. ఒక కొడుకుగా.. తండ్రిగా.. మాట్లాడుతున్నాను అన్నారు..

అయితే జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గురువాతం వర్ల రామయ్య,  బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా మాట్లాడుతూ ఎన్టీఆర్ స్పందన.. ప్రవచనాల్లో ఉన్నాయి అన్నారు. అత్తను అంత మాట అంటే అలాగేనా స్పందించేది అంటూ నిలదీశారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసిన టీడీపీ నేతల నిమ్మల రామునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ స్పందన స్లో మోషన్ లో ఉందని.. ఆ స్టేట్ మెంట్ ఆయనకు సేఫ్ కాని.. పార్టీకి కాదన్నారు. కొడాల నాని, వంశీలతో సంబంధం ఉందా లేదనే విషయంలో జూనియర్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి : టీడీపీలో చేరాలి అనుకునేవారికి షాక్.. వలపక్షులకు చోటు లేదన్న చంద్రబాబు

ఇలా ఓ వైపు టీడీపీ నేతలు జూనియర్ ను టార్గెట్ చేసి విమర్శిస్తుంటే.. ఆయన అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.  ఎన్టీఆర్‌ని టార్గెట్‌‌ చేయడాన్ని ఖండిస్తున్నారు. టీడీపీ నేతలు కొందరు.. కేవలం మీడియా ముందే హడావుడి చేస్తారని.. అలాంటి వారిని పార్టీకి దూరంగా ఉంచాలని మండిపడ్డారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత వారికి  లేదన్నారు.


అసెంబ్లీలో అంత జరిగితే మీరేం చేశారని ప్రశ్నిస్తున్నారు. నరికేస్తాం.. పొడిచేస్తామని సినిమా డైలాగ్‌లు చెప్పాలా అని సోషల్ మీడియా వేదికగా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ట్రెండింగ్స్‌లో #CBNShouldApologizeJRNTR అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

#CBNShouldApologizeJrNTR


కేవలం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాదు.. మహేష్ బాబు ఫ్యాన్స్ సపోర్ట్  కూడా ఉందని పోస్టులు చేస్తున్నారు. భవిష్యత్తులో తెలుగు దేశం పార్టీని లీడ్ చేయగల లీడర్ ఎన్టీఆర్ ఒక్కడే అని సోషల్ మీడియాలో టీడీపీ ట్రోల్ చేస్తున్నారు.

తగ్గాడు కదా అని ఇంకా పిండేయాలని చూడకండి.. పాలు ఇవ్వడానికి ఆడు ఆవు కాదు.. పులిరా అంటూ ట్విట్టర్ ను జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు షేక్ చేస్తున్నా ఉన్నారు..


నిన్నటి వరకు నారా భువనేశ్వరి ఇష్యూలో టీడీపీ వర్సస్ వైసీపీగా ఉంటే.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సస్ టీడీపీ అన్నట్టుగా మారింది. అయితే కొందరు మాత్రం ఇలా సోషల్ మీడియాలో ఈ అంశాన్ని వైసీపీ అభిమానులే ట్రెండ్ అయ్యేలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Jr ntr, TDP

ఉత్తమ కథలు