Home /News /andhra-pradesh /

JOURNALIST SIVA PRASAD WAS KIDNAPPED BY THE AP POLICE ALLEGES NARA LOKESH BA

జర్నలిస్టును కిడ్నాప్ చేసిన ఏపీ పోలీసులు అంటూ నారా లోకేష్ పోస్ట్

శివప్రసాద్‌ను కిడ్నాప్ చేశారంటూ నారా లోకేష్ పోస్ట్ చేసిన ఫొటో (Screen Grab/NaraLoeksh/Twitter)

శివప్రసాద్‌ను కిడ్నాప్ చేశారంటూ నారా లోకేష్ పోస్ట్ చేసిన ఫొటో (Screen Grab/NaraLoeksh/Twitter)

Nara Lokesh Tweet: తన నివాసంలో ఉన్న శివప్రసాద్‌ను అతని భార్య ఎదుటే పోలీసులు కిడ్నాప్ చేశారని లోకేష్ ఆరోపించారు.

    హైదరాబాద్‌లో జర్నలిస్టు శివప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు కిడ్నాప్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉన్న శివప్రసాద్‌ను అతని భార్య ఎదుటే పోలీసులు కిడ్నాప్ చేశారని లోకేష్ ఆరోపించారు. ‘హైదరాబాద్‌లో జర్నలిస్టు శివప్రసాద్‌ను అతని ఇంట్లోనే ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కిడ్నాప్ చేశారు. ఆయన ఏం చేశారు? ఆయన ఏపీ ప్రభుత్వ పాలసీల మీద ప్రశ్నించారు. ఎలాంటి వారెంట్, నోటీసు ఇవ్వకుండా ఫోన్‌ను కూడా జప్తు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఆడియోను జర్నలిస్టు శివప్రసాద్ కుటుంబసభ్యులు రికార్డు చేశారు. ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. కుటుంబసభ్యుల ముందే  కిడ్నాప్ చేశారు. వైఎస్ జగన్ ఏపీ పోలీసులను పార్టీ కార్యకర్తల్లా వాడుకోవడం చూసి బాధేస్తోంది. ఇది సీరియస్‌గా మానవహక్కుల ఉల్లంఘన. పోలీసులు పెద్ద తప్పు చేశారు.’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.



    నారా లోకేష్ పోస్ట్ చేసిన ఆడియో అంత స్పష్టంగా లేదు. ఇంతకీ ఆ జర్నలిస్టు ఏ సంస్తలో పనిచేస్తున్నారనే వివరాలను కూడా నారా లోకేష్ తెలియజేయలేదు. పత్రికలో పనిచేస్తున్నారా, లేకపోతే టీవీకి చెందిన వారా, సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించే వారా? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, AP Police, Nara Lokesh, Tdp

    తదుపరి వార్తలు