ఏపీ ప్రత్యేక హోదాకు జేడీయూ మద్దతు..జగన్‌కు కీలక సలహా

ఏపీ ప్రత్యేక హోదాకు జేడీయూ మద్దతు..జగన్‌కు కీలక సలహా

వైఎస్ జగన్, త్యాగి

ఏపీకి ప్రత్యేక హోదా ఎవరిస్తారో..వారికే మద్దతిస్తామని జగన్ ఇప్పటికే స్పష్టచేశారు. ఈ నేపథ్యంలో జేడీయూ సలహాపై ఆయన ఎలా స్పందిస్తారన్నది చూడాలి.

 • Share this:
  లోక్‌సభ ఎన్నికలవేళ ఏపీ ప్రత్యేకహోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రత్యేక హోదా డిమాండ్‌కు బీహార్‌కు చెందిన జేడీయూ పార్టీ మద్దతు తెలిపింది. బీహార్, ఒడిశాతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు హోదా కల్పించాలని డిమాండ్ చేసింది. ఏపీలో వైఎస్ జగన్‌తో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రత్యేకహోదా కోసం పోరాడుతున్నారని..వారికి జేడీయూ సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ నేత కేసీ త్యాగి వెల్లడించారు. ఐతే కేంద్రంలో నరేంద్ర మోదీకి వైసీపీ, బీజేపీడీ మద్దతిస్తే..ప్రత్యేక హోదాపై తాము మాట్లాడతామని స్పష్టంచేశారు.

  వెనకబడిన బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని 2004 నుంచీ జేడీయూ డిమాండ్ చేస్తోంది. ప్రకృతి విపత్తులతో ప్రతి ఏటా ఒడిశాలోని మౌలిక వసతులు ధ్వంసమవుతున్నాయి. విభజనచట్టంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీహార్‌తో పాటు ఒడిశా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నాం. వైఎస్ జగన్, నవీన్ పట్నాయక్ హోదా కోసం పోరాడుతున్నారు. వారిద్దరు మోదీకి మద్దతిస్తే హోదా విషయంలో మేం సహకరిస్తాం.
  కేసీ త్యాగి, జేడీయూ నేత
  ఏపీలో ఒకవేళ వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరికి మద్దతిస్తారన్న దానిపై రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఐతే దీనిపై వైఎస్ జగన్ ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎవరిస్తారో..వారికే మద్దతిస్తామని గతంలోనే స్పష్టచేశారు. ఈ నేపథ్యంలో జేడీయూ సలహాపై వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారన్నది చూడాలి.


  First published: