జూన్ 5న వారిని గౌరవిద్దాం.. జేడీ లక్ష్మీనారాయణ పిలుపు

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

రిటైర్డ్ ఐపీఎస్ వీవీ లక్ష్మీనారాయణ ఓ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జూన్ 5 శుక్రవారం రోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

  • Share this:
    రిటైర్డ్ ఐపీఎస్ వీవీ లక్ష్మీనారాయణ ఓ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. జూన్ 5 శుక్రవారం రోజు ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. పంటలు వేయడానికి ఆరంభంగా రైతులు ఏరువాక పున్నమి నిర్వహిస్తారు. భూమికి పూజ చేసి నాగలి పట్టి దున్నే సంప్రదాయం ఎంతోకాలం నుంచి ఉంది. ఈ ఏడాది ఏరువాక పౌర్ణమిలో రైతులతో కలసి పాల్గొనాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ‘మనకు అన్నం పెట్టే రైతు ఆరోజు పొలం పనులు ప్రారంభిస్తాడు. రైతులకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. గత ఏడాది కూడా ఉభయ రాష్ట్రాల్లో ఏరువాక పౌర్ణమిని పెద్ద ఎత్తున నిర్వహించాం. రైతులకు సంఘీభావం ప్రకటించడం చాలా అవసరం. కోవిడ్ 19 సందర్భంగా రైతుల అవసరం మరోసారి తెలుసుకుందాం. శుక్రవారం రోజు మీమీ ప్రాంతాల్లో రైతులు ఏరువాక పున్నమిలో పాల్గొని వారికి మద్దతు పలకండి. అలాగే కోవిడ్ 19 నియమావళి పాటిస్తూ ఈ కార్యక్రమంలో సహభాగం అవుదాం.’ అని వీవీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. మనకు ఉన్న పరిధిలో రైతులతో కలసి వారు చేస్తున్న కార్యక్రమానికి మద్దతు పలకాలని జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: