TTD: టీటీడీ కొత్త ఈవోగా జవహర్ రెడ్డి.. ఆ రోజు బాధ్యతల స్వీకరణ

TTD New EO Jawahar Reddy: ప్రస్తుతం జవహర్ రెడ్డి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు.

news18-telugu
Updated: October 1, 2020, 1:53 PM IST
TTD: టీటీడీ కొత్త ఈవోగా జవహర్ రెడ్డి.. ఆ రోజు బాధ్యతల స్వీకరణ
జవహర్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
టీటీడీ కొత్త ఈవోగా జవహర్ రెడ్డిని నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 9న ఆయన కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ రేపు ఈవో బాధ్యతల నుంచి రిలీవ్ కానున్నారు. ఇక కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించేవరకు టీటీడీ ఈవోగా అదనపు ఈవో ధర్మారెడ్డి బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం జవహర్ రెడ్డి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కరోనా సంక్షోభ సమయంలో ఆరోగ్యశాఖ తరపున ఆయన కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడంతో ఏపీ ప్రభుత్వం ఆయనను టీటీడీ ఈవోగా బదిలీ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ 1993 బ్యాచ్‌‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన 2017 మే నెలలో టీటీడీ ఈవోగా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నియమించింది. ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయనను టీటీడీ ఈవోగా నియమించింది. సింఘాల్ రెండేళ్ల పదవీకాలం 2019లో ముగిసింది. అయితే, వైసీపీ ప్రభుత్వం ఆయన్ను ఈవోగా కొనసాగిస్తూ అప్పట్లో నిర్ణయం తీసుకుంది.

TTD New EO Jawahar Reddy, ttd news, ap news, Tirumala news, andhra Pradesh news, ttd eo anil kumar singhal, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, టీటీడీ న్యూస్, తిరుమల న్యూస్, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్
అనిల్ సింఘాల్..


అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమించడం మీదే అప్పట్లో విమర్శలు వ్యక్తం అయ్యాయి. సహజంగా తెలుగువారు లేదా దక్షిణాది వారు ఆ పదవిలో ఉంటారు. కానీ, మొదటిసారి ఉత్తర భారతదేశానికి చెందిన అధికారిని నియమించడంతో అప్పట్లో తెలుగు అధికారుల్లో అసంతృప్తి వ్యక్తం అయింది. అయితే, బీజేపీ ఒత్తిడి వల్లే చంద్రబాబు ఏకే సింఘాల్‌ను నియమించారనే ప్రచారం కూడా ఉంది.

ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానానికి సీఎం జగన్ వెళ్లిన సమయంలో ఆయన డిక్లరేషన్ సమర్పించాలంటూ ప్రతిపక్షాలు భారీ ఎత్తున డిమాండ్ చేశాయి. దీంతోపాటు బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత ఆయన్ను తప్పించి జవహర్ రెడ్డిని ఈవోగా నియమించింది ప్రభుత్వం.
Published by: Kishore Akkaladevi
First published: October 1, 2020, 1:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading