JAWAD CYCLONE EFFECT HEAVY RAINS TENSION IN VISAKHAPATNAM VIZIANAGARAM SRIKAKULAM DISTRICTS NGS VSP
Jawad Effect: ఉత్తరాంధ్రకు తప్పని ముప్పు.. బలపడిన వాయుగుండం.. రెండు రోజులు స్కూళ్లకు సెలవు
ఉత్తరాంధ్రకు భారీ ముప్పు
Jawad Effect: మొన్న రాయలసీమ.. నేడు ఉత్తరాంధ్ర.. ఆంధ్రప్రదేశ్ పై వరుణుడి ప్రతాపం రోజు రోజుకూ పెరుగుతోంది. ఊహించినట్టే ఉత్తరాంధ్రను ఇప్పుడు జవాద్ వణికిస్తోంది. ఇప్పటికే వాయుగుండ బలపడడంతో.. వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
Jawad Effect to Andhra Pradesh: ఊహించిన ముప్పు తప్పడం లేదు. ఉత్తారంధ్ర గజగజ వణకాల్సి వస్తోంది. ఏపీ తీరం వైపు జవాద్ తుఫాన్ (Cyclone Jawad) దూసుకొస్తోంది. ఇప్పటికే వాయుగుండం తీవ్రంగా బలపడింది. తీవ్ర వాయుగుండంగా.. మధ్యాహ్నానికి తుఫాన్‌గా బలపడ నుంచి వాయుగుండం ప్రస్తుతం విశాఖపట్టణానికి ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడుతోంది. మధ్య బంగాఖాళాతంలో జవాద్ తుపానుగా కాసేపట్లో జవాద్ తుఫాన్ (Jawan Cyclone) గా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు, విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.
తరువాత వాయవ్య దిశలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం తీరం వరకు ప్రయాణించి శనివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో 2రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తారు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ను భారీ వర్షాలు (Heavy Rains) కుదిపేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రలోనూ వర్షాలు మొదలయ్యాయి. తుపాను నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మూడు జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఉత్తరాంధ్రకు తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలోకడప జిల్లా పర్యటనకు వెళ్లే ముందు ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, సీఎంవో కార్యాలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుఫాను భయపెడుతున్న నేపథ్యం. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఉదయం ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల అధికారులు, డీఎంహెచ్వోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావంపై ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేశారు. తుపాన్ నేపథ్యంలో ముందోస్తు జాగ్రత్తలపై ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అదేశాలు ఇచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ఇదీ చదవండి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోముకు చెక్ పెడుతున్నారా..? వైసీపీతో ఫ్రెండ్ షిప్పే కారణమా..?
తుఫాను కారణంగా ఈ రోజు (3-12-21) మధ్యాహ్నం నుండి రేపటి (4-12-21) వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టరు ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు ఈ విషయాన్ని గమనించి ఈ రోజు (3-12-21) మధ్యాహ్నం , మద్యాహ్నం భోజనం అనంతరం పాఠ శాలలను మూసి వేయాలని, విద్యార్దులను పంపి వేయాలన్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.