• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • JAPALI TEERTHAM IN ANJANADRI TIRUMALA IS BIRTH PLACE OF LORD ANJANEYA SAYS TTD HERE IS EVIDENCE SK

Hanuman Birth Place: హనుమంతుడి జన్మస్థలంపై ఇప్పటి వరకు ఉన్నవాదనలు ఏంటి? టీటీడీ ఏమంటోంది?

Hanuman Birth Place: హనుమంతుడి జన్మస్థలంపై ఇప్పటి వరకు ఉన్నవాదనలు ఏంటి? టీటీడీ ఏమంటోంది?

హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి

కర్నాటకలోని హంపి ప్రాంతమే కిష్కింధ అని చరిత్రకారులు నిర్ధారించారు. అంజనాద్రిపై జన్మించిన ఆంజనేయ స్వామి అక్కడికి 363 కిలోమీటర్ల దూరంలోని హంపికి వలస వెళ్లి ఉంటాడని చరిత్రకారులు చెబుతున్నారు.

  • Share this:
    (గండూరి రాజశుక, జ్యోతిష పండితులు)

    ఆంజనేయ స్వామి జన్మస్థలం ఏడు కొండల్లో ఒకటైన అంజనాద్రేనని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ధారించింది. శ్రీరామనవమి పర్వదినం రోజున ఒక ప్రకటన చేసింది. అనేక ఆధారాలను బట్టి అంజనాద్రే ఆంజనేయ స్వామి జన్మస్థలంగా గుర్తించినట్టు స్పష్టం చేసింది. శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య కాగా.. ఆయనకు నమ్మిన బంటు, పరమ భక్తుడు అయిన ఆంజనేయ స్వామి జన్మస్థలం అంజనాద్రి అని తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ సందర్శనకు వచ్చిన తమిళనాడు గవర్నర్‌ భన్వరీలాల్ పురోహిత్‌ కూడా నొక్కి చెప్పారు.

    ఆంజనేయ స్వామి భక్తుడైన భన్వరీలాల్ పురోహిత్ తిరుమలలో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మాట్లాడిన ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం ఒక నిపుణుల కమిటీని నియమించి, దీనిపై నాలుగు నెలపాటు అవిశ్రాంతంగా, విస్తృతంగా పరిశోధనను నిర్వహించి, అనేక సాక్ష్యాధారాలు సేకరించి.. హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అని నిర్ధారించినట్లు తెలిపారు.

    పరిశోధకుల బృందంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ మురళీధర్ శర్మ కూడా సభ్యుడిగా ఉన్నారు. పురాణాలు, ఇతిహాసాలు, వైజ్ఞానిక అంశాలు, గ్రంథాలయాలు, భూభౌతిక సాక్ష్యాధారాలను శోధించి, విశ్లేషించి చివరికి అంజనాద్రే ఆంజనేయ స్వామి జన్మస్థలంగా నిర్ధారించామని, నిజానికి 12 పురాణాలు ఇదే విషయాన్ని నిర్ధారించాయని ఆయన వెల్లడించారు.

    తిరుగులేని ఆధారాలు:

    ఆంజనేయ స్వామి తల్లి అంజనా దేవి ఈ పర్వతంపై కూర్చుని శివుడి కోసం తపస్సు చేసినట్టు, శివుడి అనుగ్రహంతో ఆంజనేయ స్వామి జన్మించినట్టు వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో ప్రస్తావించడం జరిగింది. అంజనా దేవి తపస్సు చేసినందు వల్లే ఆ పర్వతానికి అంజనాద్రి అనే పేరు వచ్చింది. అంతేకాదు, శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని 1491, 1545 సంవత్సరం నాటి శాసనాలను బట్టి అంజనాద్రే ఆంజనేయ స్వామి జన్మస్థలమని నిర్ధారణ అవుతోంది. .

    వ్యాస భారతంలోని వన పర్వం, వాల్మీకి రామాయణంలోని సుందర కాండ, కిష్కింధ కాండ, శివ పురాణం, శతరుద్ర సంహిత, బ్రహ్మాండ పురాణం, శ్రీవెంకటాచల మహత్యం, స్కంద పురాణం, ఎపిగ్రాఫికా ఇండికాలో కూడా అంజనాద్రి గురించి, ఆంజనేయ స్వామి పుట్టుక గురించి ప్రస్తావన ఉంది. లండన్‌లోని ఒక గ్రంథాలయంలో లభించిన అంజనాద్రి మహత్యం అనే గ్రంథంలో అంజనాద్రే ఆంజనేయ స్వామి జన్మస్థలం అని పేర్కొనబడి ఉంది. కంబా రామాయణంలోని కిష్కింధ కాండలో, హంస దూతం అనే మరో గ్రంథంలో కూడా అంజనాద్రే ఆంజనేయ స్వామి జన్మస్థలం అని స్పష్టంగా చెప్పి ఉంది.

    విభిన్న వాదనలు:
    నిజానికి, ఆంజనేయ స్వామి జన్మస్థలం విషయంలో గతంలో కొందరు పరిశోధకులు ఇందుకు విరుద్ధమైన ప్రకటనలు చేశారు. ఆంజనేయ స్వామి తమ ప్రాంతంలోనే జన్మించినట్టు ఐదు ప్రాంతాలకు చెందిన పరిశోధకులు గతంలో వాదించారు. కర్నాటక హంపికి సమీపంలో ఒక అంజనాద్రి ఉంది. ఆంజనేయుడు అక్కడే జన్మించినట్టు కొందరు పరిశోధకులు వాదించారు. అయితే, అందుకు సాక్ష్యాధారాలేవీ లభించలేదని హంపిలోని కర్నాటక విశ్వవిద్యాలయం పరిశోధకులు ఆ తర్వాత పేర్కొన్నారు.

    కాగా, జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో అంజన్‌ అనే గ్రామం ఉంది. అక్కడే ఆంజనేయుడు జన్మించినట్టు కొందరు వాదన లేవనెత్తుతారు. అయితే, ఆ వాదనను నిర్ధారించడానికి ఆధారాలు లభించలేదు. గుజరాత్‌లోని నవసారి ప్రాంతంలో అంజన అనే గుట్ట ఉంది. అక్కడే ఆంజనేయుడు జన్మించాడనే వాదన ఉంది. కానీ, అది కూడా నిర్ధారణ కాలేదు. ఇక హర్యానాలోని కైతల్‌ ప్రాంతం నుంచి కూడా ఇటువంటి వాదనే వచ్చింది. కానీ దానికీ చారిత్రక, పౌరాణిక ఆధారాలేవీ లభించలేదు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న త్రయంబకేశ్వరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో అంజనేరి అనే పర్వతం ఉంది. అక్కడ నుంచి కూడా కొందరు ఈ రకమైన వాదనలు చేశారు. కానీ ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదు.

    కర్నాటకలోని హంపి ప్రాంతమే కిష్కింధ అని చరిత్రకారులు నిర్ధారించారు. అంజనాద్రిపై జన్మించిన ఆంజనేయ స్వామి అక్కడికి 363 కిలోమీటర్ల దూరంలోని హంపికి వలస వెళ్లి ఉంటాడని చరిత్రకారులు చెబుతున్నారు.

    ‘‘అంజనాద్రే ఆంజనేయ స్వామి జన్మస్థలమని నిర్ధారిస్తూ అనేక చారిత్రక, పౌరాణిక, ఐతిహాసిక, వైజ్ఞానిక ఆధారాలతో కూడిన నివేదిక రూపొందించాం. హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్రకు చెందిన కొందరు రచయితలు కేవలం స్థానిక నమ్మకాలను ఆధారంగా చేుకొని, ఆంజనేయ స్వామి తమ ప్రాంతం వారని వాదించారు. ఐతే అందుకు సాక్ష్యాధారాలు లభించలేదు.'' అని తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ కే.ఎస్. జవహర్ రెడ్డి తెలిపారు.

    అంజనాద్రిపై పరిశోధన చేసిన నిపుణుa కమిటీలో వైస్‌ ఛాన్స్‌లర్లు సన్నిధానం సుదర్శన శర్మ, మురళీధర శర్మ, నిపుణులు సదాశివమూర్తి, జె. రామక ష్ణ, ఇస్రో శాస్త్రవేత్త మూర్తి రేమెళ్ల, శంకర నారాయణ, కన్వీనర్ డాక్టర్ ఎ.విభీషణ శర్మ తదితరులు ఉన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు