హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Tarakaratna: నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్

Tarakaratna: నందమూరి తారకరత్న త్వరగా కోలుకోవాలి: పవన్ కల్యాణ్

తారకరత్న

తారకరత్న

Tarakaratna: పాదయాత్రలో బాగానే కనిపించిన తారకరత్న.. కొద్దిదూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా పడిపోయారు. చుట్టూ కార్యకర్తలు ఉన్న సమయంలో.. ఆయన సొమ్మసిల్లి పడిపోయారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) తీవ్ర అస్వస్థతకు గురవడం ఇటు సినిమా ఇండస్ట్రీని.. అటు టీడీపీ పార్టీని షాక్‌కు గురిచేసింది. ఆయనకు గుండెపోటు రావడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. ప్రస్తుతం కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు తారకరత్న. ఆయన త్వరగా కోలుకోవాలని సిని నటులతో పాటు రాజకీయ పార్టీల నేతలు ఆకాంక్షిస్తున్నారు. తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురవడం బాధాకరమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  (Pawan Kalyan) అన్నారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలిస్తున్నారని తెలిసిందిని.. ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యవంతులై తిరిగి తన రోజువారీ కార్యక్రమాల్లో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు పవన్ కల్యాణ్.

బాలకృష్ణకు ఫోన్ చేసిన జూనియర్ NTR..తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా..

కాగా, నందమూరి తారకరత్నకు ఇవాళ ఉదయం గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పాదయాత్రలో బాగానే కనిపించిన తారకరత్న.. కొద్దిదూరం నడిచిన తర్వాత అకస్మాత్తుగా పడిపోయారు. చుట్టూ కార్యకర్తలు ఉన్న సమయంలో.. ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఉన్న యువగళం సైనికులు, భద్రతా సిబ్బంది ఆయన్ను హుటాహుటిన కారులో కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత... పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. తారకరత్నకు గుండెపోటు వచ్చిందని.. ఆయన గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్స్ గుర్తించామని పీఈవెస్ వైద్యులు తెలిపారు. మిగతా పారామీటర్స్‌ అన్నీ బాగానే ఉన్నాయని వెల్లడించారు.

కుప్పంలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు.. మెరుగైన వైద్య చికిత్స కోసం బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ఐసీయూ సౌకర్యాలున్న అంబులెన్స్‌లో తారకరత్నను బెంగళూరుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. కుప్పంలో చికిత్స పొందుతున్న ఆయన్ను నందమూరి బాలకృష్ణ , నారా లోకేశ్ పరామర్శించారు. జూనియన్ ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్ కూడా బాలకృష్ణకు ఫోన్ చేసి.. తారకరత్న ఆరోగ్యంపై ఆరాతీశారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తారకరత్న కోలుకుంటున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Pawan kalyan, Taraka Ratna

ఉత్తమ కథలు