ప్రజారాజ్యం గెలిచిన స్థానాల్లో జనసేన హవా కొనసాగితే.. ఏం జరుగుతుంది ?

2009లో ప్రజారాజ్యం పేరుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోటీచేసినప్పటికీ ఆ పార్టీకి తెలంగాణలో దక్కింది కేవలం 2 సీట్లే, అయితే కోస్తాంధ్రలో మాత్రం దాదాపు 14 సీట్లు దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఇదే స్థాయిలో 2019 ఎన్నికల్లో సైతం జనసేనకు ఓట్లు సీట్లు సాధిస్తే మాత్రం తప్పకుండా కింగ్ మేకర్ అయ్యే చాన్స్ ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

news18-telugu
Updated: May 17, 2019, 9:32 PM IST
ప్రజారాజ్యం గెలిచిన స్థానాల్లో జనసేన హవా కొనసాగితే.. ఏం జరుగుతుంది ?
పవన్ కళ్యాణ్ ఫైల్ ఫోటో
news18-telugu
Updated: May 17, 2019, 9:32 PM IST
2009 అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని ప్రజారాజ్యం పార్టీ భారీ అంచనాల మధ్య పోటీకి దిగినప్పటికీ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 18 సీట్లు సొంతం చేసుకోగా, దాదాపు 70 లక్షల ఓట్లను పొందడంలో ప్రజారాజ్యం సఫలమైందనే చెప్పవచ్చు. ప్రజారాజ్యం పార్టీకి పోలైన 17 శాతం ఓట్లలో దాదాపు 9 శాతం ఓట్లు టీడీపీవే కావడం విశేషం. ఎందుకంటే 2004 కన్నా టీడీపీకి 9 శాతం ఓట్లలో కోత పడింది. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీకి సైతం 2 శాతం ఓట్ల కోత పడింది. అంటే అటు అధికార, ప్రతిపక్షం రెండు పార్టీలకూ ప్రజారాజ్యం ఓట్లను రాబట్టుకోవడంలో సక్సెస్ అయ్యిందనే చెప్పవచ్చు. అయితే ప్రజారాజ్యం తదనంతరం చోటుచేసుకున్న రాష్ట్ర రాజకీయాల్లో పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ లో విలీనం జరిగిపోయింది. అదంతా ఒక చరిత్ర... అయితే 2014లో ఏర్పడిన జనసేన మాత్రం ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నప్పటికీ 2019లో మాత్రం పూర్తి స్థాయిలో బరిలోకి దిగింది. అయితే జనసేనపై మొదటి నుంచి భారీ అంచనాలు లేవనే చెప్పవచ్చు. అటు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ రెండు పార్టీలకు చెందిన ఓట్లను చీలికే లక్ష్యంగా జనసేన సాగిందని చెప్పవచ్చు.

2009లో ప్రజారాజ్యం పేరుకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పోటీచేసినప్పటికీ ఆ పార్టీకి తెలంగాణలో దక్కింది కేవలం 2 సీట్లే, అయితే కోస్తాంధ్రలో మాత్రం దాదాపు 14 సీట్లు దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ప్రస్తుతం ఇదే స్థాయిలో 2019 ఎన్నికల్లో సైతం జనసేనకు ఓట్లు సీట్లు సాధిస్తే మాత్రం తప్పకుండా కింగ్ మేకర్ అయ్యే చాన్స్ ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో జనసేన సీట్లు సాధిస్తుందని రాజకీయ వర్గాల్లో అంచనా ఉంది. అయితే ఇదే కనుక జరిగితే జనసేన కార్యకర్తలకు పండగే అని చెప్పవచ్చు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...